Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూరీతో మాములుగా ఉండదు.. విజయ్ సేతుపతి సినిమా టైటిల్ వింటే బుర్రతిరగాల్సిందే..

ప్రస్తుతం పూరిజగన్నాథ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు.

పూరీతో మాములుగా ఉండదు.. విజయ్ సేతుపతి సినిమా టైటిల్ వింటే బుర్రతిరగాల్సిందే..
Puri Jagannath
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2025 | 7:35 PM

టాలీవుడ్లో  డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు పూరిజగన్నాథ్. స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఉంటుంది పూరిజగన్నాథ్ సినిమాలకు. పూరిజగన్నాథ్ వరుస ఫ్లాప్స్ తో రేస్ లో వెనుకబడ్డారు. ఆయన తరం దర్శకులు ఒకటికాకాపోయిన ఒక హిట్ అందుకుంటూ దూసుకుపోతుంటే పూరి మాత్రం వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. ఈ మధ్యకాలంలో పూరి ఏ సినిమా పట్టుకున్న అది ఫ్లాప్ అవుతుంది. సినిమాల విడుదలకు ముందుండే హైప్ వల్లో లేక పూరి సినిమాల కథల్లో బలం తగ్గడం వల్లో పూరికి పరాజయాల క్యూ పెరుగుతూ వస్తుంది. అప్పుడెప్పుడో రామ్ పోతినేనితో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి చేసిన ఏ ప్రాజెక్ట్ కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. లైగర్ లాంటి కొత్త సినిమానే కాదు.. డబుల్ ఇస్మార్ట్ లాంటి సీక్వెల్ కూడా ఈ డైనమిక్ డైరెక్టర్ కు హిట్ ఇవ్వలేకపోయింది. దాంతో ఇప్పుడు పూరి ఏ హీరోతో సినిమా చేస్తారు అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

పూరిజగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా పూరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఎప్పటిలానే హీరోయిన్ ఛార్మితో కలిసి పూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ అనుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్ కూడా నడుస్తుంది. కానీ ఈ సినిమా పూరిజగన్నాథ్ ఇప్పుడు ఓ వెరైటీ టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తుంది.

పూరిజగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాకు భవతీ భిక్షాందేహి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. పూరి సినిమాలకు వెరైటీ టైటిల్ ఉంటాయి. ఇడియట్, పోకిరి, లోఫర్,రోగ్ ఇలా వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు భవతీ భిక్షాందేహి అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ న్యూస్ తెలిసి పూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అదిరిపోయే కథతో పూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే టబులాంటి హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పై మరింత క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో