AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం మేకోవర్ మావ.. అల్లరి నరేష్ హీరోయిన్ను ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు ఇలా వచ్చారు.. అలా మాయమైపోయారు. కానీ కొందరే చేసేవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తమ మార్క్ వదిలి వెళ్తుంటారు. అలాంటి ముద్దుగుమ్మల్లో ఒకరు ఈ అందాల భామ ఒకరు. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో ఈ బ్యూటీ నటించింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది.

ఏం మేకోవర్ మావ.. అల్లరి నరేష్ హీరోయిన్ను ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jun 07, 2025 | 7:48 PM

Share

దిగ్గజ దర్శకుడు కళా తపస్వి సినిమాల్లో హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యముంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోలకు సమానంగా కథానాయికలకు ప్రాధాన్యమిచ్చేవారాయన. అందుకే ఆయన సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు బాగా ఆసక్తి చూపేవారు. విశ్వనాథ్ సినిమా హీరోయిన్ అనే పేరు తెచ్చుకోవడానికి, ఆయన సినిమాల్లో నటించడానికి ఎంతో మంది హీరోయిన్స్ క్యూ కట్టేవారు. అలా విశ్వనాథ్‌ సినిమాల్లో అవకాశం దక్కించుకున్న హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. ఆమె పేరు  మంజరి ఫడ్నిస్‌ . అల్లరి నరేశ్‌ హీరోగా తెరకెక్కిన శుభప్రదం సినిమాలో ఈ సొగసరి కథానాయికగా నటించింది. సినిమా అంతటా అచ్చమైన తెలుగమ్మాయిలా చీరకట్టుతో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఎందుకో గానీ సినిమా మాత్రం సక్సెస్‌ కాలేదు. కానీ మంజరి అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులోనూ అల్లరి నరేశే హీరో. ఇందులో అల్ట్రా గ్లామరస్‌గా కనిపించిన మంజరి ఆ వెంటనే శుభప్రదం సినిమాలో ట్రెడిషినల్‌ లుక్‌లో కనిపించి మెప్పించింది. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా యావరేజ్‌గా నిలిచినా మంజరికి ఛాన్సులు బాగానే వచ్చాయి. రాజా ఇంకోసారి సినిమాతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ శక్తి సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఆమె దురదృష్టమేమో రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి.

ఈ క్రమంలో తెలుగు తెరకు దూరమైన మంజరి హిందీలో అదృష్టం పరీక్షించుకుంది. గ్రాండ్‌ మస్తీ, సర్వ్‌ మంగళ్‌ సావధాన్‌, కిసి కిసికో ప్యార్‌ కరూన్‌, నిర్దోశ్‌ వంటి సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం అడపాదడపా హిందీ సినిమాల్లో కనిపిస్తూనే వెబ్‌ సిరీసుల్లో నటిస్తోంది. ఈ అమ్మడింకా పెళ్లి చేసుకోలేదు. అయితే ఆ మధ్యన తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మంజరి. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్‌గా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అందులో ఎంతో బొద్దుగా షాకింగ్‌ లుక్‌లో కనిపించింది మంజరి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు