AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాడిని నమ్మితే ఇజ్జత్ పాయే.. వైభవ్ ఉన్నా పరువు కాపాడేటోడు.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

Shreyas Iyer Post Match Comments: ఐర్లాండ్ చేతిలో ఎప్పుడూ ఓడిపోని టీమిండియా, ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం అభిమానులను తీవ్రంగా గాయపరిచింది. అయితే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదొక మంచి పాఠం లాంటిదని చెప్పవచ్చు. బౌలింగ్ వైఫల్యాలను సరిదిద్దుకుని, బ్యాటింగ్ ఆర్డర్ బాధ్యతాయుతంగా ఆడితేనే తదుపరి మ్యాచ్‌లో భారత్ సిరీస్‌ను సమం చేయగలదు. కొత్త ప్రణాళికలతో టీమిండియా తదుపరి మ్యాచ్‌లో ఎలా పుంజుకుంటుందో చూడాలి.

వాడిని నమ్మితే ఇజ్జత్ పాయే.. వైభవ్ ఉన్నా పరువు కాపాడేటోడు.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
Ind Vs Ire Shreyas Iyer Post Match Comments
Venkata Chari
|

Updated on: Jun 27, 2026 | 6:29 PM

Share

Shreyas Iyer Post Match Comments: టీ20 ప్రపంచకప్ గెలిచిన అహంకారంతో ఐర్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభవం ఎదురైంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమై 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో చారిత్రాత్మక ఓటమిని చవిచూసింది. ఈ ఘోర పరాజయం తర్వాత భారత నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

పిచ్ 180 పరుగులది కాదు.. బౌలర్లే సర్వనాశనం చేశారు..!

మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ తమ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమేనని కుండబద్దలు కొట్టాడు. ఈ పిచ్ అంత పెద్ద స్కోరుకు అనుకూలమైనది కాదని, పక్కా ప్రణాళికలు లేకుండా బౌలింగ్ చేయడం వల్లే ఐర్లాండ్ భారీ స్కోరు సాధించిందని అన్నాడు. ఈ పిచ్‌పై 140 కంటే ఎక్కువ పరుగులు సాధించడం చాలా కష్టమని, బౌలర్లు క్రమశిక్షణ తప్పడం వల్లే చేతులు ఎత్తేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి: IND vs IRE: ఐర్లాండ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోని ‘3 టీంలు’.. లిస్ట్‌లో 2వ పేరు షాకింగ్ భయ్యో..!

పవర్‌ప్లేలో బౌలర్లు బాగానే రాణించి రెండు వికెట్లు తీసినప్పటికీ, మిడిల్ ఓవర్లలో (మధ్య ఓవర్లలో) ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామని అయ్యర్ అంగీకరించాడు. గ్రౌండ్ బౌండరీలు చిన్నగా ఉన్నాయని తెలిసి కూడా స్ట్రైట్ షాట్లు ఆడేలా బౌలర్లు బంతులు వేశారని, దానిని ఐర్లాండ్ బ్యాటర్లు పూర్తిగా అనుకూలంగా మార్చుకుని పరుగులు రాబట్టారని అసహనం వ్యక్తం చేశాడు. ఐర్లాండ్‌ను 140 పరుగులకే కట్టడి చేసి ఉంటే లక్ష్యాన్ని సులువుగా ఛేదించేవాళ్లమని అభిప్రాయపడ్డాడు.

ప్రసిద్ధ్ కృష్ణ, సుందర్ చెత్త బౌలింగ్.. సగం స్కోరు వీళ్లదే..!

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 182 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ 36 బంతుల్లో 50 పరుగులతో చెలరేగాడు. భారత బౌలర్లలో ఇద్దరు ప్లేయర్లు దారుణంగా విఫలమై జట్టు ఓటమిని శాసించారు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకోగా, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వేసిన ఒకే ఒక్క ఓవర్లో ఐర్లాండ్ బ్యాటర్లు 19 పరుగులు పిండుకున్నారు. ఐర్లాండ్ చేసిన మొత్తం స్కోరులో దాదాపు సగం పరుగులు ఈ ఇద్దరి బౌలింగ్ లోనే రావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌.. ఆ చెత్త లిస్ట్‌లో నంబర్ 1గా శ్రేయాస్.. నెక్ట్స్ పేరు చూస్తే ఫ్యాన్స్ హర్ట్ అవ్వాల్సిందే?

అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం.. మిగతా వారంతా అట్టర్ ఫ్లాప్..!

183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మొదటి ఓవర్లో 16 పరుగులు వచ్చినప్పటికీ, రెండో ఓవర్ తొలి బంతికే సంజూ శాంసన్ (5) అవుట్ అయ్యాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ 7 బంతుల్లో కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్ చేరగా, ఇషాన్ కిషన్ 1 పరుగుకే పరిమితమయ్యాడు.

టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలినా, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 20 బంతులు ఆడిన అభిషేక్ శర్మ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసి ఆశలు రేపాడు. కానీ ఆ తర్వాత శివమ్ దూబే (25) మినహా మరెవ్వరూ క్రీజులో నిలబడలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇది కూడా చదవండి: IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!

వైభవ్ ఎందుకు ఆడలేదు? రెండో మ్యాచ్‌పై అయ్యర్ ధీమా..!

అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన యువ బౌలర్ వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన సీనియర్ ఆటగాళ్లకే మొదటి ప్రాధాన్యత ఇచ్చామని, ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు వైభవ్‌కు అవకాశం ఇస్తామని చెప్పాడు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం వల్ల జట్టు కాస్త తడబడిందని, అయితే ఈ పిచ్‌పై ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చిందని తెలిపాడు. ఈ చేదు జ్ఞాపకాన్ని మరిచిపోయి, ఆదివారం జరిగే రెండో టీ20లో సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగి ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us