Puri Jagannadh: పాపం పూరీ జగన్నాథ్.. పీత కష్టాలు పీతవి.. పూరీ కష్టాలు పూరీవి..!
Puri Jagannadh Career Update: పూరీ జగన్నాథ్. ఒక్కప్పుడు ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్. అయితే కాలం మారింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ టైమ్ కూడా రివర్స్ అయ్యింది. డబుల్ స్మార్ట్, లైగర్ వంటి డిజాస్టర్లతో కెరీర్ చిక్కుల్లో పడింది. అయితే పడినా లేవడం.. లేచి పరిగెత్తడం తెలిసిన పూరీ.. ఇప్పుడు కెరీర్‌ను ఎలా రివైవ్ చేసుకుంటారన్న ఆసక్తి ఇండస్ట్రీ జనంతో పాటు అటు ఆయన ఫ్యాన్స్‌లోనూ ఉంది.

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులైనా ఉండొచ్చు కానీ వారందరిలో పూరీ జగన్నాథ్ మాత్రం వేరు. పడినా లేవడం.. లేచి పరిగెత్తడం తెలిసిన దర్శకుడు. కెరీర్ మొదట్లో పూరీ చూపించిన జోరు చూసి అందరూ ఫిదా అయిపోయారు. వరస విజయాలతో టాలీవుడ్‌ను కొన్నేళ్లు ఏలేసాడు. కానీ టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..! పూరీ కూడా అంతే.. ఓ టైమ్ తర్వాత సినిమాలేవీ ఆడలేదు.. మొన్నొచ్చిన డబుల్ ఇస్మార్ట్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాంతో పూరీ నెక్ట్స్ సినిమా ఏంటి అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ. డబుల్ ఇస్మార్ట్ రిలీజ్‌కు ముందు వరకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారులే అనుకున్నారు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఎంత క్రేజ్ ఉన్నా.. పూరీకి ఇప్పుడు ఫ్లాపులున్నాయి.
లైగరే అనుకుంటే.. డబుల్ ఇస్మార్ట్ దాన్ని మించిన డిజాస్టర్ అయింది. దాంతో పూరీ కెరీర్ డైలమాలో పడిపోయింది. ఈయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందో అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుందిప్పుడు. ముఖ్యంగా ఏ హీరో ఆయన్ని నమ్ముతాడనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. పూరీ జగన్నాథ్ తనకు తానుగానే రెండు మూడు ఆప్షన్స్ సిద్ధం చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. అందులో మొదటిది గోపీచంద్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయడం. 2010లో వచ్చిన గోలీమార్ యావరేజ్‌గా ఆడింది.. ఆ కాంబో మరోసారి రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు పూరీ జగన్నాథ్. గోపీచంద్ కూడా ఇప్పుడు పూరీ జగన్నాథ్‌కు టైమ్ ఇవ్వట్లేదని ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. ఎందుకంటే గోపీ కూడా ప్రస్తుతం దారుణమైన ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి టైమ్‌లో మరో ఫ్లాప్ డైరెక్టర్‌ను నమ్మి రిస్క్ తీసుకుంటాడా అనేది అనుమానమే.
మరోవైపు నాగార్జున కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు పూరీ. ఇక డిజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డతోనూ సినిమా కోసం ట్రై చేస్తున్నాడు పూరీ. వీటన్నింటితో పాటు అప్పుడెప్పుడో చిరు కోసం రాసిన ఆటో జానీ కథకు మరోసారి మెరుగులు దిద్దుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు బాలయ్య సైతం మంచి కథ తీసుకొస్తే ఛాన్స్ ఇస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. కళ్ల ముందు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ అందులో ఏది వర్కవుట్ అవుతుందనేది చూడాలి.