Music Trend: టాలీవుడ్‌లో నయా హిట్ ట్రెండ్ ఇది.. సినిమాల్లో పాపులర్ ప్రైవేట్ సాంగ్స్
టాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. ఈ మధ్య ఏ పాట విన్నా కూడా ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్లుందే అనిపిస్తుంది. దానికి కారణం అవి ప్రైవేట్ సాంగ్స్ కావడమే. పాతికేళ్ళ కింది నుంచే వీటి దూకుడు కనిపిస్తుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా కోసం ఏం పిల్లా మాటాడవా అనే పాట పాడారు.

ఈ రోజుల్లో పాటలు ఇన్‌స్టంట్ హిట్ అవ్వడం చాలా కష్టం. అందుకే ఆల్రెడీ హిట్టైన పాటలను తీసుకొచ్చి వాడేసుకుంటున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాంగ్స్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. టాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. ఈ మధ్య ఏ పాట విన్నా కూడా ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్లుందే అనిపిస్తుంది. దానికి కారణం అవి ప్రైవేట్ సాంగ్స్ కావడమే. పాతికేళ్ళ కింది నుంచే వీటి దూకుడు కనిపిస్తుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా కోసం ఏం పిల్లా మాటాడవా అనే పాట పాడారు. గతేడాది భోళా శంకర్‌లో మంగ్లీ అండ్ బ్యాచ్ చేసిన ఆడునెమలి పాటను వాడేసారు చిరంజీవి.
తెలుగు సినిమాలో ప్రైవేట్ సాంగ్స్ వాడుకోవడం మ్యూజిక్ డైరెక్టర్స్‌కు ట్రెండ్ అయిపోయింది. ధమాకాలో పల్సర్ బైక్ పాట అలాంటిదే. సినిమాలో పాటలన్నీ ఒకెత్తు అయితే.. చివర్లో వచ్చే ఆ ఒక్క పల్సర్ బైక్ బిట్ నెక్ట్స్ లెవల్ అంతే.. ఈ పాటలో రవితేజ, శ్రీలీల ఊపుకు థియేటర్స్ అన్నీ విజిల్స్‌తో మోగిపోయాయి. ఇప్పుడు ధామాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న మజాకా సినిమాలోనూ సొమ్మసిల్లిపోతున్నవే నా చిన్ని రాములమ్మా అనే పాటను వాడుకుంటున్నారు. ఇక రాజా ది గ్రేట్‌లో గున్నా గున్నా మామిడి అంటూ ఇరక్కొట్టాడు మాస్ రాజా. దీనికి యూ ట్యూబ్‌లో 140 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక రెండేళ్ళ కింద కోట బొమ్మాళిలోని లింగి లింగి లింగిడి పాట కూడా ప్రైవైట్ సాంగే.
నాని దసరా సినిమాలో చిత్తూ చిత్తూల బొమ్మ అంటూ బతుకమ్మ పాటను వాడుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్. ఈ పాట పిక్చరైజేషన్ అదిరిపోయేలా చేసారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సూపర్ హిట్ సాంగ్స్ రీమిక్స్ చేయడం ఒక పద్దదైతే.. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన ప్రైవేట్ సాంగ్స్ తీసుకుని సినిమాలో సిచ్యువేషన్‌కు తగ్గట్లు వాడుకోవడం మరో స్టైల్. నాగ చైతన్య లవ్ స్టోరీలోని సారంగదరియా అనే పాట ఎప్పట్నుంచో తెలంగాణ పల్లెల్లో మార్మోగుతూనే ఉంది. దాన్నే తీసుకుని సినిమాలోని కథకు అనుగుణంగా రాసారు సుద్దాల అశోక్ తేజ. అలాగే అల వైకుంఠపురములో రాములో రాములా పాట కూడా జానపదమే.. దీన్ని మోడ్రనైజ్ చేసి రాసారు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్.
కరోనా టైమ్‌లో టిక్ టాక్‌లో ఊపేసిన నాదీ నకిలీసు గొలుసు మూలం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా అక్కడీ పాట ఫేమస్. దాన్నే పలాస 1978లో వాడుకున్నారు మేకర్స్. అలాగే బోనాల సమయంలో వచ్చే నువ్ పెద్ద పులినెక్కినావమ్మో పాటని ఛల్ మోహన్ రంగా సినిమాలో నితిన్‌తో రీమిక్స్ చేసారు థమన్. ఇక మగధీరలో ఏం పిల్లో ఎల్దమొస్తవా ట్యూన్ హిట్ అవ్వడంతో పాటు.. వివాదమూ అయింది. ఈ ఫోక్ సాంగ్స్‌పై ఫోకస్ చేయడంలో పవన్ అందరికంటే ముందుంటాడు. తమ్ముడులో తాటిచెట్టెక్కలేవు నుంచి ఖుషీలో బైబైయ్యే బంగారు రమనమ్మా, జానీలో నువ్వూ సారా తాగుడు మాను లింగం, అత్తారింటికి దారేదిలో కాటమరాయుడా వరకు ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ తన సినిమాలతో మరింత ఫేమస్ అయ్యేలా చేసారు పవర్ స్టార్. మొత్తానికి ఇదే ఇప్పుడు ట్రెండ్.. అందుకే అంతా అలా ఫాలో అయిపోతున్నారు.




