Guntur Karaam: గుంటూరు కారం నుంచి పూజా హెగ్డేను అందుకే రీప్లేస్ చేశాం.. అసలు విషయం చెప్పిన నిర్మాత
ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ గా పూజాహెగ్డే హీరోయిన్ గా ఎపిక చేశారు. పూజాకార్యక్రమంలోనూ పూజా పాల్గొంది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుంది . దాంతో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నాడు శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. దాంతో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. అయితే పూజా హెగ్డే తప్పుకోవడానికి కారణాలు ఇవే అంటూ..
సూపర్ స్టార్ మహేష్ బాబు బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ గా పూజాహెగ్డే హీరోయిన్ గా ఎపిక చేశారు. పూజాకార్యక్రమంలోనూ పూజా పాల్గొంది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుంది . దాంతో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నాడు శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. దాంతో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. అయితే పూజా హెగ్డే తప్పుకోవడానికి కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే నటించిన సినిమాలనే ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్స్ అవుతున్నాయి. ఆమె చేసిన తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చేసిన సినిమాలన్నీడిజాస్టర్ గా నిలిచాయి. దాంతో ఆమె ఐరెన్ లెగ్ అని అందరు అంటున్నారు. ఆ కారణంతోనే పూజలను తప్పించారని అని కొందరు. ఆమె పెళ్లి పీటలెక్కనుంది అందుకే సినిమాలను బ్రేక్ ఇచ్చిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడానికి కారణం చెప్పారు నిర్మాత నాగ వంశీ. గుంటూరు కారం సినిమాను ముందుగా ఆగస్టులో రిలీజ్ చేద్దాం అనుకున్నాం.. కానీ ఇప్పుడు 2024 జనవరికి రిలీజ్ చేయనున్నాం. అందుకే కంగారు లేకుండా నెమ్మదిగా షూటింగ్ చేస్తున్నాం. అదే సమయంలో పూజా హిందీలో ఓ సినిమా చేయాల్సివచ్చింది. దాంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమెను గుంటూరు కారం నుంచి ఆమెను తప్పించాం అని అన్నారు. అయితే కొంతమంది దానికి ఎందుకు హంగామా చేస్తున్నారో తెలియదు అంటూ అన్నారు నాగ వంశీ. అలాగే సినిమా అద్భుతంగా వస్తుంది. సంక్రాంతి పండగకు ఎం కావాలో అవన్నీ సినిమాలో ఉన్నాయి. సంక్రాంతికి సినిమా రావడం పక్కా.. త్వరలోనే గుంటూరు కారం మొదటి పాటను విడుదల చేస్తాం అని అన్నారు నాగ వంశీ.
నిర్మాత సూర్య దేవర నాగవంశి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.