Tollywood : ఈవారం చిన్న సినిమాలాగే హవా.. ఎన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయంటే.!

ఈ వారం కూడా ఓటీటీల్లో దాదాపు 30 సినిమాలు సిరీస్ లు రిలీజ్ కానున్నాయి. అలాగ థియేటర్స్ లోనూ పదుల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఈ వారం చిన్న సినిమాలాగే హవా అంతా.. ఈవారం చాలా సినిమా చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఈ వారం ప్రేక్షకులను అలరించాడని సిద్దమైన హీరోలు ఎవరు.. వారి సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.! వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సుధీర్ బాబు నటిస్తున్న మామ మశ్చీంద్ర

Tollywood : ఈవారం చిన్న సినిమాలాగే హవా.. ఎన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయంటే.!
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 03, 2023 | 8:22 AM

వారం వారం సినిమాల సందడి ఎక్కువవుతుంది. ఓ వైపు ఓటీటీలు.. మరో వైపు థియేటర్స్ అంటూ పదాలు సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీల్లో దాదాపు 30 సినిమాలు సిరీస్ లు రిలీజ్ కానున్నాయి. అలాగ థియేటర్స్ లోనూ పదుల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఈ వారం చిన్న సినిమాలాగే హవా అంతా.. ఈవారం చాలా సినిమా చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఈ వారం ప్రేక్షకులను అలరించాడని సిద్దమైన హీరోలు ఎవరు.. వారి సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.! వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సుధీర్ బాబు నటిస్తున్న మామ మశ్చీంద్ర నటుడు హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sudheer Babu (@isudheerbabu)

ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలో విడుదల చేయనున్నారు.  ఈ సినిమా అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న రూల్స్‌ రంజన్‌’ సినిమా కూడా ఈవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పై బోలెడన్ని ఆశలతో ఉన్నాడు కిరణ్. రూల్స్‌ రంజన్‌ సినిమా అక్టోబరు 6న విడుదల కానుంది.

నవీన్‌ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటిస్తున్న సినిమా మంత్ ఆఫ్ మధు. ఈ సినిమా కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్‌ నాగోతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో లవ్ అండ్ ఎమోషన్స్ తో డాగ్ ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ధీమాతో ఉన్నారు చిత్రయూనిట్.

View this post on Instagram

A post shared by Swathi (@swati194)

నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మ్యాడ్. ఎన్టీఆర్ సతీమణి సోదరుడు నార్నే నితిన్‌ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కూడా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘800′ సినిమాకూడా అక్టోబర్ 6న విడుదల కానుంది. సిద్ధార్థ్‌, అంజలీ నాయర్‌, నిమిష సజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్తా సినిమా తెలుగు చిన్న పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అక్టోబర్ 6న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.