Tollywood : సోషల్ మీడియాలో అందాల భామల హంగామా.. ఆఫర్స్ లేకపోయినా..

నాని నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అను ఇమాన్యుయల్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను అందుకోలేకపోయింది. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలనే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో సినిమా అవకాశము మెల్లగా తగ్గుతూ వచ్చాయి ఈ చిన్నదానికి. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.

Tollywood : సోషల్ మీడియాలో అందాల భామల హంగామా.. ఆఫర్స్ లేకపోయినా..
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 03, 2023 | 8:48 AM

స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతగా జీవితాన్ని గడపాలని చూస్తుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తోంది సమంత. వెకేషన్స్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ.. మానసికంగా స్ట్రాంగ్ కావడానికి ప్రయత్నిస్తుంది సామ్. ఇదంతా కలలా ఉంది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది సామ్.

నాని నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అను ఇమాన్యుయల్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను అందుకోలేకపోయింది. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలనే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో సినిమా అవకాశము మెల్లగా తగ్గుతూ వచ్చాయి ఈ చిన్నదానికి. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా చీరకట్టులో ఓ ఫోటో షేర్ చేసింది అను.

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

రుక్సార్ దుల్హాన్.. నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించింది . ఆతర్వాత విశ్వక్ సేన్ నటించిన ఆకాశంలో అర్జున  కళ్యాణం అనే సినిమాలో మెరిసింది. ఆతర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఈ వయ్యారి సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఓరు ఆధార్ లవ్ సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ప్రియకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత ఈ చిన్నది నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. రీసెంట్ గా బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ సిస్టర్ గా కనిపించింది. సోషల్ మీడియాలో ప్రియా అందాలు ఆరబోస్తూ అదరగొడుతోంది. తాజాగా మరోసారి హాట్ ఫోటోలను పంచుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.