Anupama Parameswaran: అనుపమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన అల్లు అరవింద్.. తనలో ఎలాంటి నటన ఉండదంటూ..
ఇటీవలే ఈ చిత్ర టీజర్ కి, శ్రీమణి సాహిత్యం అందించిన "నన్నయ్య రాసిన" పాటకు "టైం ఇవ్వు పిల్ల" అనే పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ఏడు రంగుల వాన పాట ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అరవింద్.. అనుపమ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న సినిమా 18 పేజిస్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాను “జీఏ 2” పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ కి, శ్రీమణి సాహిత్యం అందించిన “నన్నయ్య రాసిన” పాటకు “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ఏడు రంగుల వాన పాట ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అరవింద్.. అనుపమ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “గత నాలుగు మాసాలుగా నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్నా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ,సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి మా ధన్యవాదాలు. సుకుమార్ నాతో ఒక విచిత్రమైనలవ్ స్టోరీ చేద్దామని చెప్పడంతో వాసు కూడా తెగ సంబరపడిపోయాడు. మేము తీసిన “18 పేజెస్” సినిమా ఒక సాధారణ మైన లవ్ స్టోరీ కాదు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్ ఏడు సినిమాలు చేశాడు అవన్నీ మ్యూజికల్ గా బిగ్ హిట్ అయ్యాయి.ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తన హృదయంలో ఆవేదన గానీ ఆ రాగం గానీ లేకపోతే ఇంతమంచి పాటలు రావు. కార్తికేయ సినిమా తరువాత అదే జోడీతో ఈ 18 పేజెస్ సినిమా రావడం చాలా హ్యాపీ గా ఉంది. అందరూ నేను చేసే సినిమాలు చూసి ఇది అరవింద్ గారి సినిమా అంటారు కానీ అంతా బన్నీ వాసే తన టీంతో మా సినిమాలను చాలా చక్కగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు .
నిఖిల్ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. నాకు న్యాచురల్ గా నటించించే అనుపమ అంటే చాలా ఇష్టం. తనలో ఎలాంటి నటన ఉండదు. చాలా ట్రాన్స్ పరేంట్ గా ఉంటుంది. మనసులో ఏది ఉంటే అది మొహంలో కనిపిస్తుంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. తనను చూసినప్పుడల్లా తనలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందుకే నాకు చాలా తనంటే చాలా ఇష్టం. చాలా చక్కటి సాహిత్యాన్ని అందించే లిరిసిస్ట్ శ్రీమణి మా ఫ్యామిలో మెంబెర్ అయ్యాడు.ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. ఈ నెల 23 న వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.