Priyanka Chopra: మీరెప్పుడు మా గుండెల్లోనే ఉంటారు.. ప్రియాంక చోప్రా ఎమోషనల్..
హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు వైరలవుతుంది. మీరు ఎప్పుడూ మా గుండెల్లోనేఉంటారు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో ఆమె స్ట్రాంగ్ గా ఉండాలని.. ధైర్యం చెబుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే..

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. జూన్ 16న ఆమె మామ.. హీరోయిన్ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా మృతిచెందారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామన్ రాయ్.. సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. రామన్ రాయ్ మరణం పట్ల విచారం వ్యక్తం చేసింది. “”మీరు ఎల్లప్పుడూ మా హృదయాలలో ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంకుల్ (ఫుఫా జీ) ఓం శాంతి” అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. రామన్ రాయ్ వయసు 72 సంవత్సరాలు.
హీరోయిన్ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ ఢిల్లీ హైకోర్టులో ప్రముఖ లాయర్. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. హీరోయిన్ మన్నారా చోప్రా 1991 మార్చి 29న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్ 17’ రియాలిటీ షోలో ఇటీవల సందడి చేసింది మన్నారా.
ఆమె హిందీతోపాటు తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ షిప్ట్ అయ్యింది మన్నారా. ఇటీవలే హిందీ బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది. మన్నారా చోప్రా తండ్రి అంత్యక్రియలు ఇంకా పూర్తి కాలేదు. రామన్ రాయ్ అంత్యక్రియలు జూన్ 18 బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు ముంబైలోని అంబోలి అంధేరి వెస్ట్ శ్మశానవాటికలో జరుగుతాయి.

Priyanka
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..