- Telugu News Photo Gallery Cinema photos Director Maruthi said that three heroines have been fixed for The Raja Saab movie as per Prabhas request
The Raja Saab: ది రాజాసాబ్‌లో అందుకే ముగ్గురు హీరోయిన్లను ఫిక్స్ చేసాం: మారుతి..
లవ్, యాక్షన్, ఫాంటసీ, మైథాలజీ.. అంటూ దాదాపు అన్ని జానర్ సినిమాలు చేసారు ప్రభాస్. కానీ హారర్ జానర్‌ను మాత్రం చేయలేదు. దీంతో ప్రభాస్‌కు హారర్ మూవీ చేయాలని ఆశ ఉంది. ఇది ది రాజా సాబ్ మూవీతో నెరవేరింది. ఓ సమయంలో మారుతి కలవడం, కథ చెప్పడం, అది నచ్చడంతో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. తాజాగా ఈ సినిమా టీజర్ ఈవెంట్లో మారుతి ఈ మూవీ హీరోయిన్స్ ఎంపిక విషయంలో ఓ ఆసక్తికర వార్తను రెవీల్ చేసారు. ఏంటి ఆ న్యూస్.? ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Jun 17, 2025 | 5:40 PM

ది రాజా సాబ్ కథకి డార్లింగ్ ఓకే చెప్పిన కూడా చివరి చిత్రం పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావడంతో పాన్ ఇండియా హీరోతో సాహసం చేయడం దేనికని వెనకడుగు వేసాడట మారుతి. అయితే ప్రభాస్ ముందుకు వెళ్దామని అభయం ఇవ్వడంతోసినిమాను తెరకెక్కించాడు. అనేక వాయిదాల తర్వాత డిసెంబర్ 5న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది ఈ మూవీ.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా జూన్ 16న విడుదలైన టీజర్‌కి మూవీ లవర్స్ నుంచి విశేష స్పందన లభించింది. డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయ్యారు. ఇప్పట్టినుంచి నాన్-స్టాప్ అప్డేట్స్ ఇస్తామని మేకర్స్ ప్రకటించడంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు ప్రభాస్ అభిమానులు.

ఇదిలా ఉంటె రాజాసాబ్ టీజర్ రిలీజ్ సందర్భంగా మారుతి ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసాడు. ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ.. సలార్‌లో ఉన్న కథానాయిక ఎప్పుడో ఒకసారి వస్తుంది. కల్కి 2898 ఏడీలో కూడా ఒకమ్మాయి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది. ఆదిపురుష్‌లోనేమో సీతాదేవి ఎక్కడో ఉంటుంది. నా దగ్గర, నా ఇంట్లో ఎవరూ లేరు డార్లింగ్.. ఇద్దరు హీరోయిన్లను పెడతావా? అని అడిగాడట.

అప్పుడు మీ రేంజ్‌కు ఇద్దరేంటి? డార్లింగ్ ముగ్గుర్ని పెడతానన్నాను అన్నాడట డైరెక్టర్ మారుతి. అలా ముగ్గురు హీరోయిన్లను తీసుకెళ్లి హారర్ కొంపలో పెట్టాను. ఇది రొమాంటిక్ హారర్ ఫాంటసీగా తెరకెక్కించాను అని ఈవెంట్లో చెప్పాడు మారుతి.

ఇది చూసిన నెటిజన్లు పాపం.. ప్రభాస్ రొమాంటిక్ లవ్‌స్టోరీలను చాలా మిస్సవుతున్నట్లున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




