Sekhar Kammula: ఆ హీరో విషయంలో బాగా టెన్షన్ పడేవాడిని.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల..
డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు తెలుగులో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా చిన్న సినిమాలతోనే భారీ విజయాలను ఎందుకున్న దర్శకులలో ఆయన ఒకరు. ఫ్యామిలీ డ్రామా, అందమైన ప్రేమకథ అయినా అడియన్స్ మనసులను హత్తుకునే చిత్రాలు తీయడంలో శేఖర్ కమ్ముల ప్రత్యేకం.

తెలుగులో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. హ్యాపీడేస్, లవ్ స్టోరీ, లీడర్ వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు కుబేర సినిమాతో వెండితెరపై మరో మ్యాజిక్ చేయనున్నారు. కోలీవుడ్ హీరో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మొదటిసారి నాగ్, ధనుష్ కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై మరింత హైప్ నెలకొంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా హీరో ధనుష్ కారణంగా ఎంతో టెన్షన్ పడినట్లు చెప్పుకొచ్చారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ధనుష్ సైతం దర్శకుడు కావడంతో ఏదైనా ఒకవేళ మరో టేక్ తీసుకోవాల్సి వచ్చినా.. మరేదైనా సూచన చేసిన ఆయన ఏమంటారోనన్న టెన్షన్ షూటింగ్ కు ముందు ఉండేదని అన్నారు.
కానీ సింగిల్ టేక్ లోనే ధనుష్ పూర్తి చేశారని.. దర్శకుడు మాత్రమే కాకుండా.. సింగర్.. లిరిసిస్ట్.. హీరో ధనుష్ మల్టీటాలెంటెడ్ అంటూ ప్రశంసలు కురిపించారు. నాగార్జున, ధనుష్, రష్మిక, జిమ్ షర్బ.. ఇంతమంది స్టార్ నటీనటులతో కలిసి పనిచేయడం తనకు మొదటిసారి అని.. ధనుష్ సింగిల్ టేక్ యాక్టర్ అని అన్నారు. అలాగే నాగార్జునతో ఇదివరకే పరిచయం ఉండడంతో ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండానే షూటింగ్ చేశానని.. జిమ్ ఇంగ్లీష్ లోనే మాట్లాడగలడని.. అయినా తొలి సన్నివేశంలోనే తెలుగు, తమిళం భాషలలో డైలాగ్స్ అనర్గళంగా చెప్పి ఆశ్చర్యపరిచాడని అన్నారు.
పాత్రల డిమాండ్ మేరకు ఈ నటీనటులను ఎంపిక చేశానని.. కుబేర కథాలోచన రావడమే అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక కుబేర సినిమా విషయానికి వస్తే.. ముంబయి చుట్టూ తిరిగే కథ అని.. స్టోరీకి తగ్గట్టే భారీ బడ్జెట్ తో తెరకెక్కించామని అన్నారు శేఖర్ కమ్ముల. ఈ చిత్రాన్ని జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..




