AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: బాలయ్య షోలో పెద్దనాన్న గురించి ఎమోషనల్ అయిన ప్రభాస్.. ఆ సమయంలో నేను హాస్పటల్లోనే ఉన్నానంటూ..

గెస్ట్ లను బాలయ్య ప్రశ్నలు, తికమక పెడుతూ వారిని ఆటపట్టించే తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణతో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన అన్ స్టాపబుల్ టాప్ టాక్ షో గా దూసుకుపోతోంది.

Prabhas: బాలయ్య షోలో పెద్దనాన్న గురించి ఎమోషనల్ అయిన ప్రభాస్.. ఆ సమయంలో నేను హాస్పటల్లోనే ఉన్నానంటూ..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Jan 03, 2023 | 6:02 PM

Share

నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ షో కు హాజరై ప్రేక్షకులను అలరించారు. గెస్ట్ లను బాలయ్య ప్రశ్నలు, తికమక పెడుతూ వారిని ఆటపట్టించే తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణతో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన అన్ స్టాపబుల్ టాప్ టాక్ షో గా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ షో కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే.ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే జనవరి 6న రెండో పార్ట్ న్బు స్ట్రీమింగ్ చేయనున్నారు. మొదటి భాగంలో ప్రభాస్ ఒక్కడే హాజరై అలరించారు . అలాగే రెండో పార్ట్ లో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా హాజరయ్యారు.

ఇదిలా ఉంటే ఈ రెండో పార్ట్ లో ప్రభాస్ తన పెద్ద నాన్న కృష్ణం రాజు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవలే కృష్ణం రాజు అనారోగ్య సమస్యతో కన్నుమూసిన విషయం తెలిసిందే ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే.. మీ పెద్ద నాన్నతో మీ అనుబంధం ఎలా ఉండేది అని ప్రశ్నించగా.. ప్రభాస్ మాట్లాడుతూ.. ఈరోజు మేము ఇలా ఉన్నాం అంటే అది ఆయన వల్లే. పెద్ద నాన్నకు ఎప్పటికి రుణపడి ఉంటాం. ఆ రోజుల్లో మద్రాసు వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా పనిచేసి, సొంతంగా బ్యానర్‌ని ప్రారంభించి మహిళా ప్రాధాన్యత కలిగిన కథలతో చరిత్ర సృష్టించారు. మా కుటుంబం మొత్తం ఆయనను చాలా మిస్సవుతోంది అని అన్నారు ప్రభాస్.

అలాగే బాలకృష్ణ కృష్ణం రాజు మృతి గురించి ప్రభాస్ ను అడగ్గా..ఆయన ఒక నెలపాటు అనారోగ్యంతో బాధపడ్డారు. ఆ సమయంలో నేను ఆసుపత్రిలో ఆయనతోనే ఉన్నాను అలాగే షూటింగ్ సమయంలో కూడా ఎప్పుడూ డాక్టర్స్ తో టచ్‌లో ఉన్నాను అన్నారు. ఇక బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను షూటింగ్ కోసం టర్కీలో ఉన్న అందుకే ఆయన చివరి చూపుకు రాలేక పోయాను. కృష్ణం రాజు గారు చనిపోయారని తెలిసినప్పుడు నేను ఏడుపు ఆపుకోలేకపోయాను అన్నారు బాలయ్య.

ఇవి కూడా చదవండి
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..