Spirit : ఇది కదా కావాల్సింది.. ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. స్పిరిట్ షూటింగ్ ఎప్పుడంటే..

యానిమల్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు సందీప్, ప్రభాస్ కాంబోలో రాబోయే స్పిరిట్ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Spirit : ఇది కదా కావాల్సింది.. ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. స్పిరిట్ షూటింగ్ ఎప్పుడంటే..
Spirit Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 06, 2024 | 3:53 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు డార్లింగ్. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వింటేజ్ ప్రభాస్ కనిపించనున్నాడు. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చే మూవీకి స్పిరిట్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. పోలీస్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ ఇటీవలే స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాట్లు తెలుస్తోంది. తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ భూల్ భూలయ్యా 3 ప్రమోషన్లలో ఇంటర్వ్యూలో స్పిరిట్ షూటింగ్ గురించి మాట్లాడారు.

ప్రస్తుతం తాము స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నామని.. అందులోని నటీనటుల ఎంపిక ఇంకా ఖారారు కాలేదని.. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని.. దానీ త్రవాత షూటింగ్ పనులు స్టార్ట్ చేస్తామని అన్నారు. డిసెంబర్ చివరిలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ ఉంటుందని.. వెంటనే సందీప్ వంగా యానిమల్ పార్క్ స్టార్ట్ చేయనున్నారని అన్నారు. దీంతో త్వరలోనే వరుసగా స్పిరిట్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ పనులు దీపావళి సందర్భంగా స్టార్ట్ అయ్యాయని ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్పిరిట్ చిత్రానికి దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. హర్షవర్దన్ సందీప్ ట్యూన్స్ ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్పిరిట్ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు తొలి రోజే రూ. 150 కోట్ల వసూళ్లు రావడం ఖాయమని గతంలోనే సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్ లో కనిపిస్తారని అన్నారు. ఆయన గత 24 సినిమాల్లో అడియన్స్ ఒక విధంగా చూశారని.. ఈ చిత్రంలో మరో స్థాయిలో చూస్తారని హామీ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!