‘సాహో’ మూవీ రిలీజ్‌ డేట్ ఎప్పుడంటే..!

'సాహో' మూవీ రిలీజ్‌ డేట్ ఎప్పుడంటే..!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ మూవీ రిలీజ్ టైం వచ్చేసింది. ‘బాహుబలి’ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో.. ఆ తర్వాత వచ్చే సినిమా.. ‘సాహో‌’ను కూడా యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కాగా.. తాజాగా.. ‘యూవీ క్రియేషన్స్‌ ట్వీట్ చేస్తూ.. సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. సాహో చిత్ర విడుదలలో క్రాంప్రమైజ్ అయ్యే ప్రస్తక్తి లేదంటూ.. ఆగష్టు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 19, 2019 | 11:20 AM

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ మూవీ రిలీజ్ టైం వచ్చేసింది. ‘బాహుబలి’ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో.. ఆ తర్వాత వచ్చే సినిమా.. ‘సాహో‌’ను కూడా యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

కాగా.. తాజాగా.. ‘యూవీ క్రియేషన్స్‌ ట్వీట్ చేస్తూ.. సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. సాహో చిత్ర విడుదలలో క్రాంప్రమైజ్ అయ్యే ప్రస్తక్తి లేదంటూ.. ఆగష్టు 30న’ ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా.. ఖచ్చితంగా విడుదల చేస్తున్నట్లు ట్వీట్‌‌లో తెలిపారు. మొదట ఆగష్టు 15న విడుదల చేయాలని అనుకున్నారు కానీ.. అనివార్యకారణవల్ల ఆ తేదీని కాన్సెల్ చేశారు.

పక్కా యాక్షన్ సినిమాగా ‘సాహో’ మూవీని ప్రపంచస్థాయి హంగులతో తెరకెక్కించారు. ఈ మధ్యనే విడుదలైన సాహో థియేట్రికల్ ట్రైలర్ కూడా.. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకత్తించింది. ఈ సినిమా సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ మళ్లీ ఇప్పుడు వెండి తెరపై మెరవనున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా.. అందాల భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించారు. సుజీత్ డైరెక్టర్‌గా, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్, వీ వంశీ క్రిష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పల పాటి నిర్మించారు. బాలీవుట్ నటులు అరుణ్ విజయ్, నిల్ నితిన్ ముఖేష్, జాకీ షరాఫ్ నటించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu