AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: సర్జరీ సక్సెస్..! హైదరాబాద్‏కు ‘సలార్’ ఆగయా.. ఇక ప్రమోషన్స్ జోరు..

సర్జరీ తర్వాత మూడు నెలలపాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇక బుధవారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ప్రభాస్ ఎంటర్ అయిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన రాజ్యంలోకి రాజు అడుగుపెట్టాడు.. సలార్ ఆగయా... సలార్ ఆగమనం అంటూ కామెంట్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ త్వరలోనే సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Prabhas: సర్జరీ సక్సెస్..! హైదరాబాద్‏కు 'సలార్' ఆగయా.. ఇక ప్రమోషన్స్ జోరు..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2023 | 12:11 PM

Share

యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు ఇది శుభవార్తే. దాదాపు మూడు నెలల విరామం తర్వాత ప్రభాస్ హైదరాబాద్ చేరుకున్నారు. కొంత కాలంగా మోకాలి సమస్యతో బాధపడుతున్న ప్రభాస్.. ఇటీవల సలార్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్జరీ కోసం ఆగస్టులో ఇటలీ వెళ్లాడు. అక్కడే సర్జరీ తర్వాత మూడు నెలలపాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇక బుధవారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ప్రభాస్ ఎంటర్ అయిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన రాజ్యంలోకి రాజు అడుగుపెట్టాడు.. సలార్ ఆగయా… సలార్ ఆగమనం అంటూ కామెంట్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ త్వరలోనే సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సలార్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కేజీఎఫ్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందులోనూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు నీల్. అంతేకాకుండా ఇందులో ప్రభాస్ మాస్ రగ్గడ్ లుక్‏లో కనిపిస్తుండడంతో సలార్ చూసేందుకు అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ తిరిగి హైదరాబాద్ రావడంతో ఇక సలార్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సలార్ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు ప్రాంతాల్లో సలార్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.