Balakrishna: గొడ్డలికి కళ్లజోడుతో బాలకృష్ణ కొత్త సినిమా.. బాబీ ప్రాజెక్ట్ అప్డేట్ అదిరిపోయింది..
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న బాలయ్య.. ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ బాబీ... ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు. గత కొన్ని నెలల క్రితమే వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరిగాయి. కానీ అప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ఫోస్టర్ షేర్ చేస్తూ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో రూపొందించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖండ, వీరసింహా రెడ్డి సినిమాల తర్వాత బాలయ్య నటించిన ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న బాలయ్య.. ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ బాబీ… ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు. గత కొన్ని నెలల క్రితమే వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరిగాయి. కానీ అప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ఫోస్టర్ షేర్ చేస్తూ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని చిత్రయూనిట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ షేర్ చేసింది. గొడ్డలికి కళ్లజోడు పెట్టి, ఆంజనేయస్వామి బిళ్ల ఉన్న దండ వేసి ఉండగా.. ఆ కళ్లజోడులో అవతల జరిగే పోరాట సన్నివేసాలు చూపిస్తున్నట్లు ఉండేలా డిజైన్ చేసిన పోస్టర్ చూస్తుంటే… ఈసినిమాతో మరోసారి యాక్షన్ విధ్వంసం సృష్టించిందేకు బాలయ్య రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్, వైలెన్స్ కి విజిటింగ్ కార్డ్ అంటూ బాలకృష్ణ గురించి చెబుతూ పోస్ట్ చేశారు.
Lights Camera Action 🪓👓
Blood Bath Ka Brand Name 🩸 Violence Ka Visiting Card 🔥
Natasimham #NandamuriBalakrishna garu & @dirbobby’s #NBK109 Shoot Begins from today! 😎#NBK109ShootBegins 💥@vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/Z41nMo4gE3
— Sithara Entertainments (@SitharaEnts) November 8, 2023
ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. నాగవంశీ నిర్మాతాగ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం NBK109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ తెలియాల్సి ఉంది. అలాగే ఇందులోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఇంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.