Adipurush: శరవేగంగా ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్.. ముంబైలో భారీ క్రోమా సెట్..

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఆకాశాన్ని తాకింది. ఆ సినిమాతర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు డార్లింగ్.

Adipurush: శరవేగంగా ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్.. ముంబైలో భారీ క్రోమా సెట్..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 30, 2021 | 7:36 AM

Prabhas: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఆకాశాన్ని తాకింది. ఆ సినిమాతర్వాత పాన్ ఇండియా స్టార్‌‌‌గా మారిపోయాడు డార్లింగ్. ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైన్‌‌‌లో పెట్టి ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసిన రెబల్ స్టార్.. ఇప్పుడు తన ఫోకస్ ఆదిపురుష్ పైన పెట్టనున్నాడు. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్‌‌‌గా నటిస్తోంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఆదిపురుష్ విషయానికొస్తే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓ రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టారు. ఈ సినిమాలో రామాయణ ఇతిహాస నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణ్‌‌గా భయపెట్టనున్నారు. అలాగే సీతాపాత్రలో ముద్దుగుమ్మ కృతిసనన్ కనిపించనుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌‌‌ను ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో జరుపుతోన్నారు. ఈ సినిమాకోసం అక్కడ ఓ భారీ క్రోమా సెట్ ఏర్పాటు చేశారు. గ్రాఫిక్స్ మరియు విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన సెట్‌‌‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా చాలా వరకు గ్రీన్ మ్యాట్ పైనే షూట్ చేయనున్నారు. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాను 2022 ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాతో పాటు సలార్ సినిమాలో ప్రభాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్నారు. అలాగే నాగ్‌‌‌‌అశ్విన్ డైరెక్షన్‌‌‌‌లో ‘ప్రాజెక్ట్ K’  అనే సినిమాను కూడా ఇటీవలే పట్టాలెక్కించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anchor Rashmi Gautam: మంత్రి కేటీఆర్‌ సాయం కోరిన యాంకర్‌ రష్మీ గౌతమ్‌.. దేని కొరకు అంటే..!

Posani Krishna Murali: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమూరళీకి కరోనా పాజిటివ్‌.. వాయిదా పడ్డ సినిమా షూటింగ్‌లు

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘రాధేశ్యామ్’ వరకు.. ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాలు ఇవే.. ప్రేక్షకులకు పండగే..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!