AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: “నేను లవ్ మ్యారెజ్ చేసుకుంటాను”.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రభాస్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas).. పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్ (Radhey Shyam).

Prabhas: నేను లవ్ మ్యారెజ్ చేసుకుంటాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రభాస్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2022 | 5:36 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas).. పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్ (Radhey Shyam). డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ మూవీపై అంచనాలు సైతం భారీగానే ఉన్నాయి. అలాగే ముందు నుంచి ఈ మూవీపై స్పెషల్ ఇంటెన్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ రేపు (మార్చి 11న) పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా రాధేశ్యామ్ చిత్రయూనిట్ లోకల్ నుంచి నేషనల్ మీడియా వరకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ గా ఉంటున్నాడు. ఇందులో భాగంగా.. ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ఠక్కున గుర్చొచ్చే పేరు ప్రభాస్. ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడు.. ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు అని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి అనంతరం ప్రభాస్.. అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి స్పందిస్తూ.. ప్రభాస్.. అనుష్క స్నేహితులు మాత్రమే అని..వారికి అలాంటి ఉద్దేశ్యం లేదంటూ తేల్చీ చెప్పింది. దీంతో మరోసారి పెళ్లి ప్రస్తావన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్.. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ప్రభాస్ తన పెళ్లి గురించి ప్రస్తావించాడు.

ప్రభాస్ మాట్లాడుతూ.. “బాహుబలి సినిమా తర్వాత దాదాపు 5 వేలకు పైగా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి.. ఆ పెళ్లి రిక్వెస్ట్స్ అన్ని నాకు పెద్ద కన్య్ఫూజన్ అయ్యాయి. నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. కానీ ఎప్పుడనేది తెలియదు. మా అమ్మ నేను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. మా ఇంట్లో నా పెళ్లి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ నేను బాహుబలి తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని మాటిచ్చాను.. నేను ప్రేమ వివాహమే చేసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్.

Also Read: Sitara Gattamaneni: సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ఏకంగా బుర్జ్ ఖలీఫానే..

Rashmi Gautham: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన రష్మి.. తేలికగా ఆ మాటలు అనేస్తుంటారు అంటూ..

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…

ET Movie Review: నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!..