Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…

ఇటీవల సినిమా టికెట్‌ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా...
Pawan Kalyan Bheemla Nayak
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 10, 2022 | 2:56 PM

ఇటీవల సినిమా టికెట్‌ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. కొత్తగా విడుదలైన జీవో ఇటు చిత్రపరిశ్రమకు.. డిస్టిబ్యూటర్లకు సంతృప్తికరంగా ఉందని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సభ్యులు, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఏపీ సీఎం జగన్.. మంత్రి పేర్ని నాని వంటి వారికి ధన్యావాదాలు చెప్పారు. దీంతో సినీ పరిశ్రమకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం టికెట్‌ ధరలపై కొత్త జీవో ఇవ్వడం ఆనందంగా ఉంది అని సినీ ప్రముఖులు తెలిపారు.

విశాఖపట్నంలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అందుకు కూడా మేం కృషి చేస్తాం. చిన్న సినిమాలకు మంచి జరిగే దిశగా ప్రయత్నం చేస్తాం. ఇండిస్టీ కష్టాలను అర్థం చేసుకున్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తారని ఆశిస్తున్నాం’ అని సి కళ్యాణ్‌ పేర్కొన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘పరిశ్రమ కష్టాలను అర్థం చేసుకుని మా విజ్ఞప్తిని స్వీకరించి, జీవో అమలు చేసినందుకు ఏపీ సర్కారుకు కృతజ్ఞతలు. ఇతర సమస్యలను కూడా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

అయితే జీవో ఇంత త్వరగా రావడానికి పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పవచ్చని. తాను నటించిన భీమ్లా నాయక్ సినిమాని విడుదల చేయకుండా అలా ఆపితే జీవో మరింత ఆలస్యం అవుతుందని భావించిన పవన్ కళ్యాణ్ ముందుగానే సినిమాని విడుదల చేశారట. ఏపీలో లాస్ వస్తే తనే సొంత డబ్బుని డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇస్తానని భరోసా ఇచ్చారట. తన ఒక్కడి వలన సినిమా ఇండస్ట్రీఅంతా ఇబ్బంది పడొద్దని భావించిన పవన్ కళ్యాణ్ ఇలా చేశారంటూ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ అన్నారు. తగ్గించిన టికెట్ రేట్లు అమల్లో ఉన్న టైమ్ లోనే ధైర్యం చేసి భీమ్లానాయక్ ను రిలీజ్ చేశారట నిర్మాతలు. రిలీజైన వారాంతం కాకపోయినా, ఆ మరుసటి వీకెండ్ కైనా కొత్త జీవో వస్తుందని ఆశపడ్డారని.. కానీ కొత్త జీవో భీమ్లానాయక్ కు అందుబాటులోకి రాలేదు. కాకతాళీయమా, కావాలని చేశారా అనే విషయాన్ని పక్కనపెడితే భీమ్లానాయక్ మాత్రం కొత్త రేట్ల బెనిఫిట్ ను అందుకోలేకపోయిందని టాక్ వినిపిస్తోంది.  ఏదైమైనా.. రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందు జీవో రావడంతో అటు మేకర్స్.. ఇటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Also Read: Chiranjeevi: ఆడపడుచులను సొంత బిడ్డల్లా చూసుకునే చిరు భార్య సురేఖ.. కోట్ల విలువజేసే ఆస్తులను రాఖీ గిప్ట్ ఇచ్చిన వైనం

Viral Photo: అందానికి పర్యాయపదం.. ఆమె కళ్లలోనే తెలియని ఇంద్రజాలం.. ఒక్క సినిమాతో సెన్సేషన్

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..