AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ఆడపడుచులను సొంత బిడ్డల్లా చూసుకునే చిరు భార్య సురేఖ.. కోట్ల విలువజేసే ఆస్తులను రాఖీ గిప్ట్ ఇచ్చిన వైనం

Megastar Chiranjeevi: నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అవుతున్నాయి. నేను నాది.. నా ఫ్యామిలీ.. భార్య, భర్త పిల్లలు సంతోషముగా ఉంటె చాలు అనుకుంటున్నవారే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మానవ..

Chiranjeevi: ఆడపడుచులను సొంత బిడ్డల్లా చూసుకునే చిరు భార్య సురేఖ.. కోట్ల విలువజేసే ఆస్తులను రాఖీ గిప్ట్ ఇచ్చిన వైనం
Megastar Chiranjeevi
Surya Kala
|

Updated on: Mar 10, 2022 | 1:45 PM

Share

Megastar Chiranjeevi: నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అవుతున్నాయి. నేను నాది.. నా ఫ్యామిలీ.. భార్య, భర్త పిల్లలు సంతోషముగా ఉంటె చాలు అనుకుంటున్నవారే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలే అనిపిస్తున్నాయని పెద్దలు వాపోతున్నారు కూడా.. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం తాను స్వయం కృషితో ఎదగడమే కాదు.. నేను నా స్వార్ధం అని చూసుకోకుండా తన అన్నదమ్ములను, చెల్లెళ్ల బాధ్యత కూడా తీసుకున్నారు. వారి ఎదుగలకు కారణం అయ్యారు. ఐతే దీనికి చిరు భార్య సురేఖ(surekha) సహకారం కూడా ఉంది. భార్య సురేఖ సపోర్ట్ లేకపోతే భర్త ఏ పని పూర్తి చేయలేడని మెగాస్టార్ మరోసారి వెల్లడించారు. తనకంటే తన అన్నదమ్ములు ఒక్క రూపాయి ఎక్కువుగా ఆస్తులు పంచుకున్నా.. ఎక్కువ సంపాదించుకున్నా తగాదాలు పెట్టుకునే ఈ రోజుల్లో చిరంజీవి మాత్రం తన చెలెళ్లకు కోట్ల రూపాయలు విలువ జేసే ఆస్తులను ఉచితంగా వారి పేరున రాసి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

చిరంజీవి తన అభిమానులనే బ్లడ్ బ్రదర్స్ గా భావించి వారికి ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలన్నా చేస్తారు. మరి అలాంటిది రక్తం పంచుకుని తోడబుట్టిన వారి  బాధ్యతలు తీసుకోవడం ఆయన పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. అయితే తాను ఈరోజు ఈ స్టేజ్ కు ఎదగడానికి కారణం భార్య సురేఖ అని సగర్వంగా చిరంజీవి చెబుతారు. అంతేకాదు భార్య మంచి మనసు గురించి.. తన ఆడబిడ్డలను కూడా సొంత బిడ్డల్లా ఎలా చూసుకుంటుందో చిరంజీవి స్వయంగా వెల్లడించారు.

రాఖీ పండగ కానుకగా తాను తన చెల్లెలు ఇద్దరికీ కోట్ల విలువజేసే కోకాపేట భూములను రాసి ఇచ్చేలా సురేఖ చేసిందని చెప్పారు. చిరంజీవి  కొన్ని ఏళ్ల క్రితం వ్యవసాయం చేయడం కోసం కోకాపేటలోని కొంత భూమిని కొన్నారు. ఐతే అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితులు లేకపోవడంతో ఆ భూములను అలాగే వదిలేశారు. ఇప్పుడు ఆ భూముల విలువ కొన్ని కోట్లు చేస్తుంది. అయితే ఆ భూమిలోని కొంత మొత్తాన్ని తన ఆడబడుచులకు ఇద్దామని సురేఖ సలహా ఇచ్చారు. అంతేకాదు ఆమె స్వయంగా భూమి రిజిస్ట్రేషన్ పనులు చేయించి.. చిరంజీవివి రాఖీ కట్టిన సమయంలో గిప్ట్ గా ఆ భూమి తాలూకా ఆస్థి పత్రాలు అన్న చేతుల మీద్దుగా చెల్లెళ్లకు ఇప్పించారు. ఈ విషయాన్నీ స్వయంగా చిరంజీవి మహిళా దినోత్సవం రోజున వెల్లడించారు.

ఇప్పడు సురేఖ మంచి మనసు గురించి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి ఇప్పటికే చెల్లెళ్లకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. అందరినీ సెటిల్ చేశారు. అయినప్పటికీ ఇంకా సురేఖ తన భర్త సంపాదించిన ఆస్తులను ఆడబడుచులకు ఇవ్వాలా అనుకోలేదు అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సురేఖ మంచి మనసుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read:

 ఉత్తి చేతులతో బాంబు డిఫ్యూజ్ చేసిన ఉక్రేనియన్.. వీడియో చూస్తే మీకు ఫ్యూజులౌట్..!

సూది బెజ్జంలో “శివలింగం’ చూసేందుకు రెండు కళ్లు చాలవు.. శబాష్ అంటున్న నెటిజన్లు.. వీడియో