AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఉత్తి చేతులతో బాంబు డిఫ్యూజ్ చేసిన ఉక్రేనియన్.. వీడియో చూస్తే మీకు ఫ్యూజులౌట్..!

Viral Video: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. దానిని కనీసం చూడాలన్నా చాలా గుండె ధైర్యం కావాల్సిందే. మామూలుగా మనం దీపావళి టపాకాయలు కాల్చేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉంటాం.

Viral Video: ఉత్తి చేతులతో బాంబు డిఫ్యూజ్ చేసిన ఉక్రేనియన్.. వీడియో చూస్తే మీకు ఫ్యూజులౌట్..!
Viral Video
Ayyappa Mamidi
|

Updated on: Mar 10, 2022 | 1:26 PM

Share

Viral Video: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. దానిని కనీసం చూడాలన్నా చాలా గుండె ధైర్యం కావాల్సిందే. మామూలుగా మనం దీపావళి టపాకాయలు కాల్చేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉంటాం. అలాంటిది నిజమైన బాంబును(Bomb) హ్యాండిల్ చేసేటప్పుడు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. నిజంగా బాంబు దాడుల తాకిడిని మనం టీవీలో చూసినప్పుడే దేవుడా ఏంట్రా అక్కడ ఉన్న వాళ్ల పరిస్థితి అని ఒక్కసారి ఆలోచన మనస్సులోకి రావడంతోనే ఫూజులౌట్ అవుతుంటాయి.

కానీ ఉక్రెయిన్ లో రష్యా(Russia Ukraine War) తన దాడుల్లో భాగంగా ఒక భారీ బాంబును జార విడిచింది. అది గనుక పేలితే దాని విస్పోటన శక్తికి ఒక పెద్ద భవంతిని క్షణాల్లో నేల మట్టం చేయగలదు. కానీ దానిని ఉక్రెయిన్ కు చెందిన బాంబు స్క్రాడ్ కు చెందిన వ్యక్తి మాత్రం కేవలం తన రెండు చేతులు, ఒక బాటిల్ మంచినీటిని వినియోగించి దానిని డిఫ్యూజ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అతని ధైర్యాన్ని చూసిన వారందరూ మైండ్ బ్లోయింగ్ బ్రేవరీ అంటూ కొనియాడుతున్నారు. చాకచక్యతతో బాంబు పేలకుండా నిరోధించి అక్కడి వారి ప్రాణాలను కాపాడిన తెగువకు అందరూ ఫిదా అయిపోతున్నారు. జనావాసాలకు సమీపంలో పడిన బాంబును కూల్ గా హ్యాండిల్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ట్విట్టర్ లో వైరల్ గా మారిన ఈ వీడియోను మీరు చూసేయండి. దానిపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి..

ఇవీ చదవండి..

Markets Rally: కాషాయ హవాతో పరుగులు తీస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు పండగే పండగ..

Digital Gold: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?.. దాని వెనుక అసలు మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..