Viral Photo: అందానికి పర్యాయపదం.. ఆమె కళ్లలోనే తెలియని ఇంద్రజాలం.. ఒక్క సినిమాతో సెన్సేషన్

హీరోయిన్స్ కు ఫిల్మ్ కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుంది. అప్పటి జనరేషన్ హీరోయిన్లలా ఇప్పటివారు ఎక్కువకాలం నెగ్గుకురాలేకపోతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ.. కొత్త నీరు రాగానే.. పాత నీరు వెళ్లిపోతుంది అన్న చందంగా.. పాత వాళ్లకు చాన్సులు తగ్గిపోతున్నాయి.

Viral Photo: అందానికి పర్యాయపదం.. ఆమె కళ్లలోనే తెలియని ఇంద్రజాలం.. ఒక్క సినిమాతో సెన్సేషన్
Heroine Viral Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 10, 2022 | 10:38 AM

Tollywood: హీరోయిన్స్ కు ఫిల్మ్ కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుంది. అప్పటి జనరేషన్ హీరోయిన్లలా ఇప్పటివారు ఎక్కువకాలం నెగ్గుకురాలేకపోతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ.. కొత్త నీరు రాగానే.. పాత నీరు వెళ్లిపోతుంది అన్న చందంగా.. పాత వాళ్లకు చాన్సులు తగ్గిపోతున్నాయి. అయితే చేసింది కొద్ది సినిమాలే అయినా కొందరు చెక్కుచెదురని ఇమేజ్ సొంతం చేసుకుంటారు. అలాంటివారిలో అన్షు కూడా ఒకరు..  నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు సినిమాలో నటించిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించగా..విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో నాగ్ కు అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగేలా చేసింది. మన్మథుడు సినిమా ఇప్పుడు టీవీలో వస్తున్నా కూడా ఊహించనంత రేటింగ్ వస్తుంది.  ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు అంబానీ హీరోయిన్స్‌గా నటించారు. ఇరువురి పాత్రలు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా అన్షు పాత్ర కుర్రాళ్లకు విపరీతంగా నచ్చింది. ఈ ఒక్క సినిమాతో ఆమెను ఆరాదించారు చాలామంది. ఇన్నోసెన్స్ యాక్టింగ్, క్యూట్ మాటలతో ఆకట్టుకుంది అన్షు. ఈ సినిమా అనంతరం ప్రభాస్ హీరోగా వచ్చిన రెండో సినిమా రాఘవేంద్రలో అన్షు యాక్ట్ చేసింది. యాధృచ్చికంగా ఈ రెండు సినిమాల్లోనూ చనిపోయే పాత్రలే చేసింది ఈ బ్యూటీ. ఈ రెండూ కాక నీలకంఠ తెరకెక్కించిన మిస్సమ్మ సినిమాలో గెస్ట్ రోల్ లో మెరిసింది. చాలా తక్కువ సినిమాలు చేసిన అన్షు.. ఆపై లండన్ వెళ్లిపోయింది.  అక్కడే పుట్టి పెరగడంతో ఇండస్ట్రీకి కూడా అతిథిలా వచ్చి వెళ్లింది. లండన్‌లోనే బిజినెస్‌మేన్ సచిన్ సగ్గార్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ రన్ చేస్తుంది అన్షు. కాగా అన్షు లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: ఆకర్షించే మకరందం.. మన తెలుగింటి అందం.. ఎవరో గుర్తించారా..?