Viral Photo: ఆకర్షించే మకరందం.. మన తెలుగింటి అందం.. ఎవరో గుర్తించారా..?

సోషల్ మీడియా వేగం పెరగడంతో సెలబ్రిటీలకు, వారి అభిమానులకు మధ్య గ్యాప్ తగ్గింది. లైవ్ చాట్స్ చేస్తూ నిత్యం ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటున్నారు హీరోలు, హీరోయిన్లు, స్పోర్ట్స్ స్టార్స్. కాగా నెట్టింట ‘త్రోబ్యాక్’ ఫోటోలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Viral Photo: ఆకర్షించే మకరందం.. మన తెలుగింటి అందం.. ఎవరో గుర్తించారా..?
Heroine Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 10, 2022 | 8:52 AM

Trending Photo: సోషల్ మీడియా(Social Media) వేగం పెరగడంతో సెలబ్రిటీలకు, వారి అభిమానులకు మధ్య గ్యాప్ తగ్గింది. లైవ్ చాట్స్ చేస్తూ నిత్యం ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటున్నారు హీరోలు, హీరోయిన్లు, స్పోర్ట్స్ స్టార్స్. కాగా నెట్టింట ‘త్రోబ్యాక్’ ఫోటోలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరో… హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఎవరైనా సెలబ్రిటీ ఒక చైల్డ్‌హుడ్ ఫోటోను పోస్ట్ చేస్తే చాలు.. దాన్ని ఫ్యాన్స్ వెంటేనే ట్రెండ్ చేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  పైన ఫోటోలో విరబూసిన పూల మొక్కల మధ్య.. ఎంతో క్యూట్ గా ఫోటోకి పోజిస్తున్న ఈ చిన్నది ఇప్పుడొక టాలీవుడ్(Tollywood) హీరోయిన్. తెలుగుమ్మాయి కూడా.  కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌ను పోషించిన ఈమె.. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుసపెట్టి అవకాశాలను దక్కించుకుంటోంది. అందం, అభినయంతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకుంటుంది. ఇంకా గుర్తు పట్టలేదా..? ఇక మేమే చెప్పేస్తాం. ఆ ఫోటోలో ఉంది.. రీతూ వర్మ.

రీతూవర్మ.. ‘పెళ్లి చూపులు’ సినిమాతో  మంచి హిట్ సొంతం చేసుకుంది. అయితే ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ అయినా కూడా.. హీరో విజయ్ దేవరకొండకు వచ్చినట్టుగా ఈమెకు మాత్రం క్రేజ్ రాలేదు.  ఆ తర్వాత నిఖిల్‌తో కలిసి నటించిన ‘కేశవ’ కూడా యావరేజ్ గా నిలిచింది.  నాని సరసన టక్ జగదీష్‌లో, నాగశౌర్యతో కలిసి వరుడు కావలెను చిత్రాల్లో నటించింది రీతూ. ఈ రెండు కూడా ఆమె కెరీర్ కు బూస్ట్ ఇవ్వలేదు. కాగా ఈరోజు రీతూ తన 32వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈమె నటిస్తోన్న ‘ఒకే ఒక జీవితం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ అయినా ఈ బ్యూటీకి మంచి బూస్ట్ ఇవ్వాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే రీతూ వర్మ.

View this post on Instagram

A post shared by Ritu Varma (@rituvarma)

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?