AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sitara Gattamaneni: సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ఏకంగా బుర్జ్ ఖలీఫానే..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh  Babu) గారాలపట్టి సితారకు (Sitara) సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే..

Sitara Gattamaneni: సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ఏకంగా బుర్జ్ ఖలీఫానే..
Sitara
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2022 | 3:55 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh  Babu) గారాలపట్టి సితారకు (Sitara) సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. ఫోటోస్.. ఫ్యామిలీ ఫోటోస్.. డ్యాన్సింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు ఆకట్టుకుంటుంది. కేవలం ఇన్‏స్టాలోనే కాకుండా.. ఏ అండ్ ఎస్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి.. చిన్న పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిన్న వయసులోనే సితారకు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. ఇటీవల మహేష్ నటిస్తోన్న సర్కారు వారి పాట నుంచి కళావతి పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది. అలాగే.. సింగింగ్‏లోనూ సితార వేరీ టాలెంటెడ్. ఎప్పుడూ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‏గా ఉండే సీతు పాప..ఈసారి ఇంట్రెస్టింగ్ వీడియో ఫాలోవర్లతో పంచుకుంది.

అందులో లెగో ఆర్కిటేక్చర్ బుర్జ్ ఖలీఫా అనే బుక్ చూస్తూ.. సొంతంగా చిన్నపాటి బుర్జ్ ఖలీఫాను నిర్మించింది. దానిని కట్టడం స్టార్ట్ చేసినప్పుటి నుంచి చివరి వరకు ఉన్న వీడియోను తన ఇన్‏స్టాలో షేర్ చేసింది. అంతేకాకుండా.. ఇది లెగో సమయం.. నా సొంత చిన్న బుర్జ్ ఖలీఫాను నిర్మిస్తున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. సితార చిన్న బుర్జ్ ఖలీఫా నిర్మించడం చూసి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వావ్.. బ్యూటీఫుల్.. సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, వీడియోస్.. పోస్టర్స్ మూవీపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది.

Also Read: Chiranjeevi: ఆడపడుచులను సొంత బిడ్డల్లా చూసుకునే చిరు భార్య సురేఖ.. కోట్ల విలువజేసే ఆస్తులను రాఖీ గిప్ట్ ఇచ్చిన వైనం

Viral Photo: అందానికి పర్యాయపదం.. ఆమె కళ్లలోనే తెలియని ఇంద్రజాలం.. ఒక్క సినిమాతో సెన్సేషన్

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..