Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: దుబాయ్‌లో సందడి చేస్తున్న ఘోస్ట్‌ టీఎమ్‌.. ఆకట్టుకుంటోన్న నాగ్‌ కొత్త లుక్‌.

Nagarjuna: బంగార్రాజు చిత్రంతో (Bangarraju) ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు కింగ్ నాగార్జున. యంగ్‌ హీరోలకు సైతం పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ది ఘోస్ట్‌...

Nagarjuna: దుబాయ్‌లో సందడి చేస్తున్న ఘోస్ట్‌ టీఎమ్‌.. ఆకట్టుకుంటోన్న నాగ్‌ కొత్త లుక్‌.
Nagarjuna
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 10, 2022 | 5:18 PM

Nagarjuna: బంగార్రాజు చిత్రంతో (Bangarraju) ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు కింగ్ నాగార్జున. యంగ్‌ హీరోలకు సైతం పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ది ఘోస్ట్‌ (The Ghost) అనే చిత్రంలో నాగార్జున నటిస్తున్నారు. గరుడవేగ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఘోస్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రవీణ్‌ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్ర యూనిట్ దుబాయ్‌లో సందడి చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దుబాయ్‌ ఓ షిప్‌లో నాగార్జునతో పాటు దర్శకుడు ప్రవీణ్‌, హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం ట్విట్టర్‌లో సందడి చేస్తున్నాయి. ఇక వైట్‌ కలర్‌ షట్‌లో నాగార్జున సరికొత్త లుక్‌ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఘోస్ట్ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఎట్టకేలకు తాజాగా కరోనా పరిస్థితులు మెరుగుపడడంతో దుబాయ్‌లో చిత్ర యూనిట్ సినిమా చిత్రీకరణను ప్రారంభించింది.

ఇదిలా ఉంటే నిజానికి ఈ సినిమాలో నాగార్జునకు జంటగా తొలుత కాజల్‌ అగర్వాల్‌ను తీసుకోవాలని భావించారు. కానీ గర్భిణీ కావడంతో కాజల్‌ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో సోనాల్‌ చౌహాన్‌ను హీరోయిన్‌గా కాన్ఫామ్‌ చేశారు. ఈ సినిమాలో నాగ్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని లక్ష్యంతో చిత్ర యూనిట్‌ ఉంది.

Also Read: Bandi Sanjay: తెలంగాణలో TRSకు ప్రత్యామ్నాయం బీజేపీయే.. బండి సంజయ్ వ్యాఖ్యలు

Viral Photo: ఈ ఫోటోలో వివిధ జంతువులు ఉన్నాయి.. ఒంటె ఎక్కడుందో వెంటనే చెప్పేస్తే మీరు గ్రేట్ అబ్బా…

Punjab Election Results 2022: పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ఓటమి..