Bandi Sanjay: తెలంగాణలో TRSకు ప్రత్యామ్నాయం బీజేపీయే.. బండి సంజయ్ వ్యాఖ్యలు

Bandi Sanjay: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీలో అధికారం సొంతం చేసుకోవడం పట్ల తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఫలితాలు ముందుగా ఊహించినదేనన్నారు.

Bandi Sanjay: తెలంగాణలో TRSకు ప్రత్యామ్నాయం బీజేపీయే.. బండి సంజయ్ వ్యాఖ్యలు
Bandi Sanjay
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 10, 2022 | 3:39 PM

Telangana BJP: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఏ మేరకు ఉంటుంది? ఇక్కడ బీజేపీ మరింత బలపడేందుకు ఈ ఫలితాలు దోహదపడనున్నాయా? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్..  నాలుగు రాష్ట్రాల్లో బీజేపీలో అధికారం సొంతం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఫలితాలు ముందుగా ఊహించినదేనన్నారు. కొన్ని సర్వే సంస్థలు, మీడియా ప్రతినిధులు యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ పనైపోతుందని ప్రచారం చేశారని అన్నారు. అయితే టీవీ9 ఆ నాలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వాస్తవిక పరిస్థితులకు అద్దెంపట్టేలా సరైన సమాచారాన్ని అందించినట్లు అభినందనలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కావాలని అక్కడి ప్రజలు ఆశించారని పేర్కొన్నారు. తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టిందని బండి సంజయ్ అన్నారు. అందుకే రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ బద్నాం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ చేస్తున్న పర్యటనలు కేవలం విహార యాత్రలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పర్యటనలతో ఒరిగేదేమీ ఉండదన్నారు.

Also Read..

Telangana: కరెంట్ బిల్లును చూడగానే షాక్.. రేకుల షెడ్డుకు ఏకంగా రూ.21కోట్లు..

Viral Video: పెద్ద పులి, ఎలుగుబంటి ముఖాముఖి.. జంగిల్ బుక్‌లో దృశ్యం అంటూ నెట్టింట్లో వీడియో వైరల్