AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Raja Singh: టీఆర్ఎస్, ఎంఐఎంలను బుల్డోజర్లతో తొక్కిస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

BJP MLA Raja Singh: యూపీలో పార్టీలను బుల్డోజర్లతో తొక్కించినట్లే తెలంగాణలోనూ తొక్కిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కామెంట్ చేశారు. యూపీలో రౌడీయిజం, గూంఢాయిజం, మాఫియాకు యోగి సర్కారు ముగింపు పలికిందన్నారు.

MLA Raja Singh: టీఆర్ఎస్, ఎంఐఎంలను బుల్డోజర్లతో తొక్కిస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
BJP MLA Raja singh
Janardhan Veluru
|

Updated on: Mar 10, 2022 | 3:38 PM

Share

BJP MLA Raja Singh: యూపీలో కొన్ని పార్టీలను బుల్డోజర్లతో తొక్కించినట్లే.. ముందు ముందు తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎంలను బుల్డోజర్లతో తొక్కిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన కామెంట్స్ చేశారు. యూపీలో రౌడీయిజం, గూంఢాయిజం, మాఫియాకు యోగి సర్కారు ముగింపు పలికిందన్నారు. వారందరిపై యోగి బుల్డోజర్లు నడిపించారని అన్నారు. అలాగే తెలంగాణలో కూడా తాము ఇసుక మాఫియా, భూముల మాఫియా, టీఆర్ఎస్ గూంఢాయిజంపై వంద శాతం బుల్డోజర్లు నడిపిస్తామని వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్ పనైపోయిందని వ్యాఖ్యానించారు.  తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా ఖతం అవుతుందని వ్యాఖ్యానించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల రాజా సింగ్ సంతోషం వ్యక్తంచేశారు.

టీఆర్ఎస్, ఎంఐఎంపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు.. 

Also Read..

Uttarakhand Election Result: ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్లాన్ వర్కౌట్.. మళ్లీ అధికారంలోకి..

Punjab New CM: రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయను.. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి మాన్ సంచలన ప్రకటన..