Punjab New CM: రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయను.. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి మాన్ సంచలన ప్రకటన..

AAP Bhagwant Mann Punjab Election: పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది.

Punjab New CM: రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయను.. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి మాన్ సంచలన ప్రకటన..
Bhagwant Mann
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 10, 2022 | 3:47 PM

AAP Bhagwant Mann Punjab Election: పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కీలక ప్రకటన చేశారు. తాను రాజ్‌భవన్‌లో కాకుండా భగత్‌సింగ్ గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో సీఎంగా ప్రమాణం చేస్తానని మాన్ (Bhagwant Mann) ప్రకటించారు. ఆప్‌ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్న తరుణంలో భగవంత్ మాన్ సంగ్రూర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆప్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి ఫోటోలు ఉండవని తెలిపారు. కార్యాలయాల్లో షహీద్ భగత్ సింగ్, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలు మాత్రమే ఉంటాయని AAP సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తెలిపారు. ఆప్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంటున్న తరుణంలో.. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌కు సీఎం స్థాయి భద్రత కల్పించారు. పంజాబ్‌లో ధురీ నుంచి పోటీ చేసిన ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ 58,206 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కాగా.. భగవంత్ మాన్.. ప్రస్తుతం సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆప్ ఎంపీగా ఉన్నారు.

కాగా.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. 117 స్థానాలున్న పంజాబ్‌లో ఆప్ ఇప్పటివరకు 13 స్థానాలను గెలవగా.. 90 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 1 స్థానంలో శిరోమణి అకాలీదళ్ 6 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది.

ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం.. పంజాబ్‌లో భారీ ఆధిక్యంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర పాలిత ప్రాంతం అయిన ఢిల్లీలా కాకుండా పూర్తి రాష్ట్రాన్ని పాలించే మొదటి అవకాశాన్ని దక్కించుకుంది.

Also Read:

Charanjit Singh Channi: పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఘోర పరాజయం.. రెండో స్థానాల్లోనూ ఓటమి..

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎంపీ కుమారుడు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?