Charanjit Singh Channi: పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఘోర పరాజయం.. రెండో స్థానాల్లోనూ ఓటమి..
Punjab election results 2022: పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోర ఓటమి పాలయ్యారు. పంజాబ్ ఎన్నికల్లో భాగంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో

Punjab election results 2022: పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోర ఓటమి పాలయ్యారు. పంజాబ్ ఎన్నికల్లో భాగంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా చన్నీ ఓడిపోయారు. చమ్‌కౌర్ సాహిబ్, బదౌర్ నుంచి పోటీ చేశారు. కాగా.. బదౌర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లబ్ సింగ్ ఉగోకే 57,000 ఓట్లకు పైగా సాధించగా, చన్నీకి 23,000 పైగా ఓట్లు వచ్చాయి. మరొక సీటులో చన్నీకి దాదాపు 50,000 ఓట్లు రాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సమీప ప్రత్యర్థి చరణ్‌జీత్ సింగ్ – 54,000 పైగా ఓట్లు సాధించారు.
కాగా.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. 117 స్థానాలున్న పంజాబ్‌లో ఆప్ ఇప్పటివరకు 13 స్థానాలను గెలవగా.. 90 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 1 స్థానంలో శిరోమణి అకాలీదళ్ 6 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది.
ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం.. పంజాబ్‌లో భారీ ఆధిక్యంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర పాలిత ప్రాంతం అయిన ఢిల్లీలా కాకుండా పూర్తి రాష్ట్రాన్ని పాలించే మొదటి అవకాశాన్ని దక్కించుకుంది.
కాగా.. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతర్గతో పోరుతో కొట్టుమిట్టాడింది. పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకున్నప్పటికీ.. గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అమరీందర్ సింగ్‌ను తొలగించి చన్నీకి అవకాశమిచ్చింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.
Also Read: