ఫోన్ నంబర్ షేర్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కారణమిదే
30 April 2025
Basha Shek
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను బయట పెద్దగా చెప్పరు. ముఖ్యంగా తమ ఫోన్ నంబర్లను అసలు షేర్ చేసుకోరు.
అయితే టాలీవుడ్ లో బోల్డ్ అండ్ డేరింగ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరోయిన్ తన ఫోన్ నంబర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే దీని వెనక ఓ మంచి రీజన్ ఉంది. పెట్స్ షెల్టర్ కోసం స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఆ హీరోయిన్ సహాయం కోసం తన టీమ్ మొబైల్ నంబర్ ను షేర్ చేసింది.
ఆమె మరెవరో కాదు ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్.
తాజాగా పాయల్ ఇంట్లో ఉన్న పెట్‌కి పిల్లలు పుట్టాయి. ఇప్పుడు హీరోయిన్ ఇంటి నిండా పెట్స్ అయినట్టుగా కనిపిస్తోంది.
అందుకే పెట్స్ కోసం సపరేట్‌గా షెల్టర్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో పాయల్ రాజ్ పుత్ ఉన్నట్టుగా తెలుస్తోంది
ఈ క్రమంలోనే తన టీమ్ లోని ఒకరి ఫోన్ నంబర్ షేర్ చేస్తూ.. పెట్స్ షెల్టర్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయమని కోరింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోందని తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..