Prabhas : ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క విషయం చెప్పకుండా ఉండాల్సింది కదన్నా..
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. తారక్ కూడా షెడ్యూల్‌లో ఉన్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ముందు జనవరి 9, 2026న విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ కొత్త డేట్ జూన్ 25 అంటూ ప్రకటించారు.
ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఆ ఒక్క విషయం చెప్పకుండా ఉండాల్సి కదన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఓ త్రో బ్యాక్ ఇంటర్వ్యూ వీడియోలో.. ఆఫ్టర్ కేజీఎఫ్2 ప్రభాసే తనతో సినిమా చేయాలని అడిగినట్టు చెప్పారు నీల్. అంతేకాదు కేజీఎఫ్ తర్వాత తాను ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాయని.. కానీ తారక్ ట్రిపుల్ ఆర్ సినిమా డిలే అవుతుండడంతో… ఈలోగా ప్రభాస్‌తో సలార్ సినిమా తెరకెక్కించేశా అంటూ చెప్పాడు. అయితే ఈ మాటలపైనే ప్రభాస్ ఫ్యాన్స్ నొచ్చుకున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ను సినిమా ఛాన్స్ అడగలేదా? తాము మరోలా అనుకున్నాం అంటూ షాకవుతున్నారు. ఈ విషయం చెప్పకుండా ఉండాల్సింది అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ కుటుంబానికి అండగా నిలిచారు. మధుసూదన్ కుటుంబానికి 50లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మంగళగిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో పాల్గొన్న పవన్.. పహల్గాం మృతులకు నివాళులు అర్పించారు. రెండు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ క్రమంలోనే ఈ ఉగ్రదాడిలో మరణించిన నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు పవన్.
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

