Suriya : ప్లీజ్ మీరు అలా చేయకండి.. అభిమానులకు సూర్య రిక్వెస్ట్.. ఏం జరిగిందంటే..
కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ రెట్రో. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నా సూర్య.. తాజాగా తెరపై కనిపించే చెడు అలవాట్లను అనుసరించవద్దని అభిమానులకు రిక్వెస్ట్ చేసాడు. సినిమాల్లో కనిపించే సన్నివేశాలు నిజ జీవితంలో సరైనది కాదని అన్నారు.

సాధారణంగా సినీతారలు తెరపై ఏం చేసినా అభిమానులు వాటిని అనుసరిస్తారు. యాక్షన్ సన్నివేశాలు సైతం ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఇక హీరో స్టైలీష్ గా సిగరెట్స్ తాగడం, మద్యం సేవించడం తెరపై చూసి వాటిని ఫ్యాన్స్ సైతం అనుసరిస్తారు. తాజాగా తన కొత్త సినిమా రెట్రో ప్రమోషనల్లో భాగంగా అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు సూర్య. తెరపై కనిపించే చెడు సన్నివేశాలను అనుసరించవద్దు అని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ‘రెట్రో’. ఈ సినిమా షూటింగ్ తిరువనంతపురంలో శరవేగంగా జరిగింది. కొన్న రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య తన అభిమానులకు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నిజానికి రెట్రో సినిమాలో సూర్య సిగరెట్ తాగే సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సూర్య స్టైల్, లుక్స్, మేనరిజం చాలా మంది కాపీ చేశారు. అయితే ఈ విషయం గురించి సూర్య మాట్లాడుతూ.. ‘నేను సినిమాలో మాత్రమే సిగరెట్స్ తాగాను.. నిజ జీవితంలో అసలు తాగను. దయచేసి తెరపై కనిపించే సన్నివేశాలను మీరు కాపీ చేయకండి. చెడు అలవాట్లను ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఆపడం కష్టం. మీరు ఒకసారి పొగ తాగడం అలవాటు చేసుకుంటే దానిని వదిలిపెట్టలేరు. నేను సిగరెట్స్ తాగడాన్ని ప్రోత్సహించడం లేదు. కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగించాము” అంటూ చెప్పుకొచ్చారు సూర్య.
‘రెట్రో’ సినిమాలో సూర్య పరివేల్ కన్నన్ అనే పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా చాలా అంచనాలను పెంచింది. ఈ చిత్రాన్ని సూర్య భార్య జ్యోతిక నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్, సుజిత్ శంకర్ తదితరులు నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




