Tollywood: సెలబ్రెటీల గురించి చెత్త రాస్తారు.. లైక్స్ కోసమే ఇలా.. హీరోయిన్ అసహనం..
బుల్లితెరపై సీరియల్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది మౌనీ రాయ్. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. నార్త్ నుంచి సౌత్ వరకు ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా ఆమె లుక్స్ పై విపరీతమైన నెగిటివిటీ , ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వాటిపై అసహనం వ్యక్తం చేసింది.

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. టీవీల్లో ఆమె పోషించిన పాత్రలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఆమెకంటూ హీరోయిన్స్ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. ముఖ్యంగా గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంటుంది. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ ఇటు వెండితెరపై సందడి చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? కొన్నాళ్లుగా ఆమె లుక్స్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తుంది. తాజాగా తనపై వచ్చే రూమర్స్, నెగిటివ్ కామెంట్స్ పై అసహనం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. హీరోయిన్ మౌనీ రాయ్. హిందీలో వరుస సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నాగిని సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. అయితే ఇటీవల తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా జరిగిన ఈవెంట్ లో పాల్గొన్న మౌనీరాయ్ న్యూలుక్స్ పై నెట్టింట తెగ చర్చ జరిగింది. ఆమె అందం కోసం మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నారని టాక్ నడిచింది. ఈ లుక్ లో కొన్ని ఏఐ వీడియోస్ కూడా క్రియేట్ చేసి షేర్ చేశారు. తాజాగా దీనిపై మౌనీరాయ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
‘నా లుక్స్ పై వచ్చిన ఏఐ వీడియోస్ చూశాను. ఎంతో భయంకరంగా ఉన్నాయి. వేరొకరి శరీరానికి నా ముఖాన్ని అతికించారు. ఎంతో అసహ్యంగా ఉన్నాయి. ఇలాంటివి క్రియేట్ చేయడం వల్ల వారికి ఎలాంటి ఆనందం వస్తుందో ఇప్పటికీ అర్థం కాదు. నేను సోషల్ మీడియాను ఉపయోగించడం ప్రారంభించిన తొలినాళ్లలో నెగిటివ్ కామెంట్స్ చేసేవారి ప్రొఫెన్ చూసి బ్లాక్ చేసేదాన్ని. ఇప్పుడు వారిని చూస్తే జాలి వేస్తుంది. లైక్స్ కోసం సెలబ్రెటీస్ గురించి చెత్త సమాచారమంతా రాస్తారు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది మౌనీ రాయ్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




