Tollywood: గుర్తుపట్టారా..? తెలుగునాట ఒక ఊపు ఊపిన హీరోయిన్.. అగ్రతారలతో సినిమాలు
మనల్ని మనం ఎలా మార్చుకుంటూ ఎదిగాం అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్. అలానే ఎదిగి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది హీరోయిన్. తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తనెవరో మీరు చెప్పగలరా..?

ఈ ఫోటోలోని అమ్మాయి ఎవరో మీరు పోల్చగలరా..? తను తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వంటి వారి పక్కన ఆడిపాడింది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే తను తెలుగు అమ్మాయి. చిన్నప్పుడు ముద్దుగా, బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి.. పెద్దయ్యాక.. సన్నజాజిలా నాజుగ్గా మారిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది.
ఏంటి ఏమైనా ఐడియా వచ్చిందా..? అయ్యో లేదా.. అయితే మేమే చెప్పేస్తాం లేండి. తను అందాల తార సమీరా రెడ్డి. 1982 డిసెంబరు 14 న సమీర రెడ్డి జన్మించింది. ఆమె తండ్రి తెలుగువారు. తల్లి.. కొంకణి. సమీరాకు ఇద్దరు ఇద్దరు సిస్టర్. ఒక సోదరి మేఘన మోడల్ కాగా, మరొక సోదరి సుష్మ నటి. 2002లో సినీ ప్రయాణం మొదలుపెట్టిన సమీరారెడ్డి.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ ఇలా అన్ని భాషల్లో నటించారు. 2013 వరకు ఆమె ఇండస్ట్రీలో యాక్టీవ్‌గా ఉన్నారు. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. 2014లో అక్షయ్ వర్దే అనే వ్యాపారవేత్తను సమీరా రెడ్డి పెళ్లాడింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బాడీ పాజిటివిటీకి సమీరా కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఓవర్ వెయిట్, పోస్ట్ ప్రెగ్నెన్సీ సమస్యలు, బాడీ టోన్ వంటి అంశాలపై తనకు ఎదురైన అనుభవాలు షేర్ చేస్తూ.. మిగిలినవారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తుంటుంది. సమీర పెట్టిన పోస్ట్‌కు చాలామంది సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు.
View this post on Instagram




