Viral: పాము కలకలం.. బంధించేందుకు స్నేక్ క్యాచర్ యత్నం.. అతని మెడను చుట్టేసి ఇలా
ఈ భూమి అందిరిదీ. ఇందులోని పక్షులు, జంతువులు, పాములు.. అన్నింటికి ఇందులో భాగముంది. బలవంతులు అవ్వడం చేత ఇతర జీవులను చంపుతూ పోతుంటే ప్రకృతి ఓ రోజు బుద్ధి చెబుతుంది అంటున్నారు జంతు ప్రేమికులు. జనావాసాల్లోకి వచ్చే పాముల గురించి అటవీ శాఖకు లేదా స్నేక్ క్యాచర్స్‌కు సమాచారమివ్వాలని కోరుతున్నారు.
ప్రస్తుతం పాములకు మేటింగ్ సీజన్. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. భాగస్వామిని వెతుక్కుంటూ కొన్ని.. వేడి తాపానికి మరికొన్ని పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో కొందరు ఆ పాములను చంపుతుంటే.. మరికొందరు స్నేక్ క్యాచర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కర్నాటక దావణగెరె నగరంలోని ఏపీఎంసి ప్రాంగణంలో ఓ పాము కలకలం రేపింది. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. రెస్క్యూ చేస్తుండగా.. ఆ పాము అతని మెడను చుట్టుకుంది. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చాలా కష్టపడి, ఏదో విధంగా పామును మెడ నుంచి తీసి బంధించాడు ఆ స్నేక్ క్యాచర్. వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

