Punjab Assembly Electin Results: పంజాబ్ ఓటర్ల విలక్షణ తీర్పు.. ఉద్ధండులకు విశ్రాంతి
ఎన్నికల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఉద్ధండులనుకున్న వారు.. ప్రభంజనంలో కొట్టుకుపోతారు. పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అదే జరిగింది. ప్రస్తుత సీఎం చన్నీ సహా...
ఎన్నికల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఉద్ధండులనుకున్న వారు.. ప్రభంజనంలో కొట్టుకుపోతారు. పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అదే జరిగింది. ప్రస్తుత సీఎం చన్నీ సహా అన్ని పార్టీల్లోనూ సీఎం అభ్యర్థులు చతికిలపడ్డారు. ఆప్(APP) సృష్టిస్తున్న ప్రభంజనంలో పలు పార్టీల సీఎం అభ్యర్థులతో పాటు కీలక నేతలు ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో ఆశలు పెట్టుకున్న చన్నీ(Channi) చాప చుట్టేశారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. బాదౌర్, చంకౌర్ స్థానాల్లో బరిలో ఉన్న ఆయన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. చాంకేర్ సాహెబ్ నుంచి ఆప్ అబ్యర్థి, చరణ్‌జిత్ సింగ్ బదౌర్ నుంచి ఆప్ అభ్యర్థి లక్సింగ్ చేతిలో ఓటమి ఖాయం చేసుకున్నారు. పంజాబ్ కాంగ్రెస్‌ను అన్నీ తానై నడిపించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కూడా ఘోర పరాభవం తప్పేలా లేదు. అమృత్‌సర్ ఈస్ట్‌లో ఆయనపై జీవన్‌జోత్ కౌటర్ లీడ్‌లో ఉన్నారు. ఇక, చన్నీ కంటే ముందు పంజాబ్ సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ బలమైన నేతగా గుర్తింపు పొందారు. అయితే, ఈసారి ఆయనా తేలిపోయారు. పాటియాలాలో ఆప్ అభ్యర్థి అజిత్‌పాల్ సింగ్ చేతిలో 19 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ కురువృద్ధుడు శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాశ్‌సింగ్ బాదల్ కూడా ఈసారి ఓటమి దిశగానే సాగుతున్నారు. లాంబీ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ప్రకాశ్ ఈసారి ప్రకాశించలేదు. వృద్ధ బాదల్‌పై ఆప్ క్యాండిడేట్ గుర్మీత్ గుబియాన్ ఆరువేల మెజార్టీతో లీడ్‌లో ఉన్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు అకాలీదళ్ నుంచి ఈసారి సీఎం అభ్యర్థిగా ఉన్న సుక్‌వీర్ సింగ్ బాదల్ వెనుకంజలో ఉన్నారు. జలాలాబాద్‌లో పోటీ చేస్తున్న సుక్ వీర్ సింగ్‌పై ఆప్ అభ్యర్థి జగదీప్ కంభోజ్ విజయం సాధించారు. సీఎం చన్నీ రెండుచోట్ల ఓటమి దిశగా సాగుతుండటం ఒకెత్తయితే ఆయన కేబినెట్ సహచరుల్లో 12 మంది కూడా వెనుకంజలో ఉండటం విశేషం. స్పీకర్ కూడా ఓటమి దిశగానే సాగుతున్నారు.
Also Read
UP Election Results: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సునామీలో కొట్టుకుపోయిన ఎంఐఎం పార్టీ
Gold rings gift: ఈరోజు పుట్టే పిల్లలకు అక్కడ గోల్డ్ రింగ్ ఇస్తారట..! పూర్తి వివరాలు ఈ వీడియోలో…
Uttarakhand Election Result: ఉత్తరాఖండ్‌లో బీజేపీ జోరు.. అధికారం చేపట్టే దిశగా పరుగులు..!