Uttarakhand Election Result: ఉత్తరాఖండ్‌లో బీజేపీ జోరు.. అధికారం చేపట్టే దిశగా పరుగులు..!
Assembly Election Results 2022: ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో బీజేపీ హవా కొనసాగిస్తోంది. రౌండ్ రౌండ్‌కు బీజేపీ అభ్యర్థులు..
Assembly Election Results 2022: ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో బీజేపీ హవా కొనసాగిస్తోంది. రౌండ్ రౌండ్‌కు బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఉత్తరాఖండ్ (Uttarakhand )లో బీజేపీ (BJP) అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది.70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 45 స్థానాల్లో ముందంజలో ఉంది. తర్వాత కాంగ్రెస్ 23 సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఆ తర్వాత బీఎస్పీ 2 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అయితే ఏ పార్టీ అయినా అధికారం దక్కించుకోవాలంటే 36 సీట్లు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంగా కనిపిస్తోంది.
కాగా, ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగగా, 65.37 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 82,38,187. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 11,647. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 13 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ కాగా.. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ అయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన 632 మంది అభ్యర్ధులు ఈ ఫలితాల్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాగా, ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 11, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఉత్తరాఖండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశాయి. ఏదీ ఏమైనా ఉత్తరాఖండ్‌లో మరోసారి అధికారం దక్కించుకోనుండటంతో కమలనాథుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇవి కూడా చదవండి: