Assembly Election Results 2022: అయ్యో పాపం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో డీలా పడ్డ కాంగ్రెస్

Assembly Election Results 2022: ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ..

Assembly Election Results 2022: అయ్యో పాపం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో డీలా పడ్డ కాంగ్రెస్
Follow us

|

Updated on: Mar 10, 2022 | 12:07 PM

Assembly Election Results 2022: ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దూసుకుపోతోంది. ఇక పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జోరుమీదుంది. ఇక గోవా (Goa), ఉత్తరాఖండ్‌ (Uttarakhand), మణిపూర్‌ (Manipur)లలోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో (Elections) కొందరు ప్రముఖులకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో పోటీలో ఉన్న ముఖ్యమంత్రులే వెనుకంజలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మాత్రం మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేయడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటున్నారు. ఇక ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ Congress)కు మళ్లీ నిరాశ ఎదురవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం.. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ వెనుకంజలో ఉంది. ముఖ్యంగా పంజాబ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ కనీసం 20 సీట్లలో కూడా ఆధిక్యం లేకపోవడం గమనార్హం. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 12 ప్రాంతాల్లో ముందంజలో ఉండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో 77 స్థానాలు గెలుపొందింది.

ఇక ఉత్తరప్రదేశ్‌లో అయితే కాంగ్రెస్‌ నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం కావడం నిరాశకు గురి చేస్తోంది. అక్కడ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఉత్తరాఖండ్‌లో తొలుత బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత డీలా పడిపోయింది. ప్రస్తుతం అక్కడ 22 స్థానాల్లో ముందంజలో ఉన్న కాంగ్రెస్‌.. రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక గోవాలో కాంగ్రెస్‌ 12 చోట్ల, మణిపూర్‌లో 11 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ప్రియాంకా గాంధీ హోరాహోరి ప్రచారం నిర్వహించినప్పటికీ ఓట్ల లెక్కింపులో చతికిలా పడిపోయింది.

ఇవి కూడా చదవండి:

Assembly Election Results 2022: ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు షాక్‌.. ఓట్ల లెక్కింపులో వెనుకంజ

AAP: తగ్గేదే లే.. దేశంలో మరింత బలమైన రాజకీయ శక్తిగా ఆప్

Latest Articles