AAP: తగ్గేదే లే.. దేశంలో మరింత బలమైన రాజకీయ శక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ..
దేశ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు తప్పేలా కనిపించడం లేదు. చీపురు పట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఒక్కో రాష్ట్రాన్ని ఊడ్చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే దేశ రాజధాని...
Aam Aadmi Party: దేశ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు తప్పేలా కనిపించడం లేదు. చీపురు పట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఒక్కో రాష్ట్రాన్ని ఊడ్చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ(Delhi) పీఠాన్ని కైవసం చేసుకున్న ఆప్.. ఇప్పుడు దేశ రాజకీయాల్లోనూ పెనుమార్పులు తీసుకొచ్చేలా మారింది. 2012లో అరవింద్ కేజ్రీవాల్ మరియు అతని సహచరులు స్థాపించారు. పంజాబ్(Punjab) లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మనకు ఇదే విషయం కనిపిస్తోంది. పంజాబ్ ఫలితాల్లో ఆప్ దూసుకుపోతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పంజాబ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటు తమదేనన్న నమ్మకం ఆప్ లో ఏర్పడింది. పంజాబ్ లోని అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలను కాదని మరో విపక్షం ఆప్ సాధించబోతున్న విజయం సంచలనంగా మారింది.
గతంలో ఢిల్లీలో ఆప్ స్పల్ప మెజారిటీతో గట్టెక్కింది. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తమ ఉమ్మడి ప్రత్యర్ధి అయిన ఆప్ ను దెబ్బతీశాయి. దీంతో ఢిల్లీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దాని ప్రభావంతో కాంగ్రెస్ పూర్తిగా మటు మాయం కాగా.. బీజేపీ నామమాత్రంగా మారిపోయింది. ఇప్పటికీ ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ గురించిన చర్చ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు పంజాబ్ లోనూ ఆప్ గెలిస్తే అక్కడ కూడా రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఏఏపీ..
బీజేపీకి ఛాలెంజ్ చేసి నిలిచేది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమేనని ఆప్ నేత రాఘవ్ చద్దా అన్నారు. అంతే కాకుండా తమ పార్టీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పారు. ఆప్ జాతీయ రాజకీయ శక్తిగా అవతరించిందని పంజాబ్ సర్వేలు చెబుతున్నాయన్నారు. ఒక రాష్ట్రంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి పదేళ్లు పట్టింది. కానీ.. ఆప్ ఆవిర్భవించి పదేళ్లు దాటకుండానే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉందన్న ఆయన.. వివిధ సర్వేలలో పార్టీ చాలా దృఢంగా ఉందని వ్యాఖ్యానించారు.
“అరవింద్ కేజ్రీవాల్ కోట్లాది ప్రజల ఆశాజ్యోతి. దేవుడి దయతో ప్రజలు అవకాశం ఇస్తే, ఆయన కచ్చితంగా ఒక పెద్ద పాత్రలో ఉంటారు. ఆయన త్వరలోనే ప్రధాన మంత్రి హోదాలో కనిపిస్తారు. ఆప్ ఒక ప్రధాన జాతీయ రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తుంది.”
– రాఘవ్ చద్దా, ఆప్ నేత
ప్రస్తుతం కేంద్రంలో మోడీ సర్కార్ తో పోరాడుతున్న టీఎంసీ, డీఎంకే, టీఆర్ఎస్, సమాజ్ వాదీ, శివసేన వంటి పార్టీలకు ప్రస్తుతం తమ రాష్ట్రాలు దాటితే బలం శూన్యం. కానీ ఆప్ పరిస్థితి అలా కాదు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ఇప్పటికే పంజాబ్ లో విపక్షంగా కూడా ఉంది. ఈసారి పంజాబ్ లో గెలిచి అధికారం చేపడితే ఆప్ చేతుల్లోకి రెండో రాష్ట్రం వస్తుంది. దీంతో కేజ్రీవాల్ కు అండగా నిలిచేందుకు వివిధ ప్రాంతీయ పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. నిలిచేందుకు మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా క్యూ కట్టే అవకాశముంది.
Also Read
Sreesanth: బౌన్సర్ నుంచి డ్యాన్సర్ వరకు శ్రీశాంత్ కెరీర్‌లో అన్ని వివాదాలే..!
Viral Video: దొంగను రక్షించాడు.. చివరికి ఆ దొంగకే బలయ్యాడు !! ఎలా ?? వీడియో