UP Election Results: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సునామీలో కొట్టుకుపోయిన ఎంఐఎం పార్టీ

Assembly Election Results 2022: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సునామీలో MIM పార్టీ కొట్టుకుపోయింది. ఫలితాల ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లోని ఎంఐఎం కార్యాలయం పూర్తిగా బోసిపోయింది..

UP Election Results: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సునామీలో కొట్టుకుపోయిన ఎంఐఎం పార్టీ
Follow us

|

Updated on: Mar 10, 2022 | 1:47 PM

Assembly Election Results 2022: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సునామీలో MIM పార్టీ కొట్టుకుపోయింది. ఫలితాల ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లోని ఎంఐఎం కార్యాలయం పూర్తిగా బోసిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh)102 చోట్ల పోటీ చేసినప్పటికీ ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. పార్టీ అధినేత ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ 150 బహిరంగ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. యూపీలో పెద్ద ఎత్తున ముస్లిం ఓటర్లు ఉన్నప్పటికీ ఆ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోలేకపోయింది

అయితే ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ రికార్డు సృష్టించింది. 37ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి విజయం సాధించింది. 1985 తరువాత తొలిసారిగా బీజేపీ వరుసగా రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలను కైవసం చేసుకుంది. యూపీలో బీజేపీ(BJP)ని వరుసగా రెండో సారి అధికారంలోకి తీసుకురావడంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలకపాత్ర పోషించారు. ప్రధాని మోడీ మేనియాకు యోగి ఇమేజ్ తోడు కావడంతో విపక్షాలు చేతులెత్తేశాయి. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలన్న మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav), మాయావతి(Mayavathi)ల ఆశలు అడియాసలయ్యాయి. త్వరలోనే యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

Punjab Election Results 2022: పంజాబ్‌లో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ఓటమి..

Uttarakhand Election Result: ఉత్తరాఖండ్‌లో బీజేపీ జోరు.. అధికారం చేపట్టే దిశగా పరుగులు..!