KILLR Movie Glimpse: జగతి మేడమ్ అరాచకం రా బాబోయ్.. జ్యోతిరాయ్ నటించిన కిల్లర్ గ్లింప్స్ చూస్తే..
బుల్లితెరపై కనిపించే సీరియల్ నటీనటులకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగు ప్రజలు సీరియల్ సెలబ్రెటీలను తెగ ఇష్టపడుతుంటారు. కట్టుబొట్టు, నటనతో రోజూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వెండితెరపై సందడి చేస్తుంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి సైతం తెలుగులో చాలా ఫేమస్.

బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక దీపం తర్వాత అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకున్న సీరియల్ ఇదే. అటు ఫ్యామిలీ అడియన్స్ తోపాటు యూత్ సైతం ఈ సీరియల్ ను తెగ ఇష్టపడ్డారు. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన రిషి, వసుధార పాత్రలకు సేపరేట్ ఫ్యాన్ బేస్ సైతం ఉందంటే అతిశయోక్తి కాదు.. వీరితోపాటు ఈ సీరియల్లో కనిపించిన మహేంద్ర, జగతి మేడమ్ పాత్రలకు సైతం అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జగతి మేడమ్ పాత్రలో కనిపించిన జ్యోతిరాయ్ సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూ తన అద్భుతమైన యాక్టింగ్ తో కట్టిపడేసింది. అప్పట్లో ఆమె పాత్రకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే ఈ సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్న జ్యోతిరాయ్ ఇప్పుడు హీరోయిన్ అయ్యింది.
జ్యోతిరాయ్ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. అటు తన సినిమా ప్రమోషన్స్ చేస్తూనే ఇటు గ్లామర్ ఫోటోలతో నెట్టింట సెగలు పుట్టించింది. ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటిస్తున్న జ్యోతిరాయ్ సినిమా కిల్లర్. త్వరలోనే ఈ చిత్రాన్ని రీలజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. వైమానిక శాస్త్రం అనే కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో జ్యోతిరాయ్ మరోసారి గ్లామరస్ గా కనిపిస్తుంది.
అలాగే అటు రోబో తరహా పాత్రలోనూ కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ అదిరిపోయింది. అటు గ్లామర్.. ఇటు యాక్షన్ సన్నివేశాలతో సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా జ్యోతిరాయ్ యాక్టింగ్ అదరగొట్టేసింది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో లాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం నడించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
