హ్యారీ పాటర్ మూవీ సిరీస్ చిత్రాలు ఎన్ని..? అవేంటి.?  

30 April 2025

Prudvi Battula 

హ్యారీ పాటర్ మూవీ సిరీస్ 2001లో మొదలైంది అందులో మోడిటీ సినిమా 'హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్'.

2002లో దీని సెకండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే 'హ్యారీ పాటర్ అండ్ ది ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్' మూవీ.

రెండేళ్ల తర్వాత 2004లో వచ్చింది 'హ్యారీ పాటర్ అండ్ ది ప్రిజనర్ ఆఫ్ అజ్కాబాన్'. ఇది హ్యారీ పాటర్ సిరీస్‎లో మూడవ సినిమా.

'హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్' ఈ సిరీస్‎లో నాలుగవ చిత్రంగా వచ్చింది. ఇది 2005లో విడుదల అయింది.

తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని 2007లో ఐదవ పార్ట్ 'హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్' మూవీ రిలీజ్ చేసారు.

'హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్' ఈ మూవీ సిరీస్‎లో వచ్చిన ఆరవ సినిమా ఇది 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2010లో హ్యారీ పాటర్ మూవీ సిరీస్‎లో భాగంగా వచ్చిన ఏడవ సినిమా 'హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ – పార్ట్ 1'.

ఈ సిరీస్‎లో ప్రేక్షకులను అలరించిన చివరి సినిమా 'హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ – పార్ట్ 2'. ఇది 2011లో వచ్చింది.