టాలీవుడ్‎లో దేవత పాత్రల్లో ఆకట్టుకున్న హీరోయిన్స్ వీరే..

29 April 2025

Prudvi Battula 

1958లో సీనియర్ ఎన్టీఆర్ రావణుడిగా నటించిన భూకైలాస్ సినిమాలో విజయ నిర్మల సీతదేవిగా కనిపించి ఆకట్టుకున్నారు.

1958లో తెరకెక్కిన్న చెంచులక్ష్మి సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ అంజలి దేవి మహాలక్ష్మి పాత్రలో నటించి మెప్పించారు.

1995లో సౌందర్యా ప్రధాన పాత్రలో తెరకెక్కిన అమ్మోరు సినిమాలో రమ్యకృష్ణ అమ్మవారి పాత్రలో నటించి మెప్పించారు.

1997లో నాగార్జున అన్నమాచార్యులగా నటించిన అన్నమయ్య చిత్రంలో పద్మావతి దేవి పాత్రలో ఆకట్టుకుంది అలనాటి హీరోయిన్ భానుప్రియ.

1999లో దేవి సినిమాలో నాగదేవతగా నటించింది అలనాటి టాలీవుడ్ హీరోయిన్ ప్రేమ. దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ డెబ్యూ చిత్రమిది.

2011లో బాలయ్య రాముడిగా కనిపించిన శ్రీరామరాజ్యం సినిమాలో సీతదేవి పాత్రలో ఆకట్టుకుంది లేడీ సూపర్ స్టార్ నయనతార.

2012లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన వాసవి వైభవంలో మీనా పార్వతిదేవి పాత్రలో నటించి మెప్పించింది అలనాటి హీరోయిన్ మీనా.

వాసవి వైభవంలో సీరియల్ నటి సుహాసిని ఆర్య వైశ్యలు ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పాత్రలో కనిపించింది.

2013లో శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాలో అలనాటి అగ్ర కథానాయిక రోజా మహాలక్ష్మి పాత్రలో కనిపించి మెప్పించింది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కన్నప్ప సినిమా పార్వతి దేవి పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.