Egg Curry: ఎగ్ కర్రీ వండలేదని తల్లిపై కోపం.. యువకుడు ఏం చేశాడంటే..?
Telangana Crime News: క్షణికావేశంలో కొంతమంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటి వ్యక్తులపై దాడి చేయడమో లేక వారికి వారే ప్రాణాలు తీసుకోవడమో లాంటివి చేస్తున్నారు.
Telangana Crime News: క్షణికావేశంలో కొంతమంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటి వ్యక్తులపై దాడి చేయడమో లేక వారికి వారే ప్రాణాలు తీసుకోవడమో లాంటివి చేస్తున్నారు. ఇటీవల కోడి కూర వండలేదని భార్య, సొంత కుటుంబసభ్యులపై దాడి చేసి చంపిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కూనవరంలో కోడికూర వండలేదని సొంత చెల్లినే ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. ఈ ఘటనల మాదిరిగానే మరో ఘటన చోటుచేసుకుంది. కానీ.. ఇక్కడ కోడి గుడ్ల కూర వండలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి భోజనంలోకి కోడి గుడ్డు కూర చేయలేదని తల్లిపై కోపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలంలో చోటుచేసుకుంది.
జిల్లాలోని రంగాయపల్లి గ్రామానికి చెందిన మస్కూరి నర్సింహులు, సుశీల దంపతులకు ఇద్దరు కొడుకులు. అందులో చిన్న కొడుకు మములేశ్ (19) కు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో భుజానికి గాయమైంది. దీంతో మములేశ్ కొన్ని రోజులుగా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మములేశ్ తల్లిని కోడిగుడ్డు కూర వండాలని కోరాడు. ఇంట్లో గుడ్లు లేవని ఇప్పుడు వండలేనని అమె చెప్పడంతో తల్లితో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో అన్ని చోట్లా వెతికారు. ఎక్కడా అతని ఆచూకీ లభించలేదు.
అయితే.. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని మహంకాళి ఆలయం సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు గుర్తించారు. మేరకు తండ్రి నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read: