Telangana: కరెంట్ బిల్లును చూడగానే షాక్.. రేకుల షెడ్డుకు ఏకంగా రూ.21కోట్లు..

అతను ఓ రేకుల షెడ్డులో నివశిస్తున్నాడు.  ఇల్లు చూస్తే.. పెచ్చులూడి పోయిన పాత గోడలు.. గట్టిగా గాలివాన వచ్చిందంటే కూలిపోయేట్టున్న పై కప్పు.  పేద కుటుంబం.  ఇంట్లో ఒక ప్యాన్, ఒక టీవి, రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి.

Telangana: కరెంట్ బిల్లును చూడగానే షాక్.. రేకుల షెడ్డుకు ఏకంగా రూ.21కోట్లు..
Representative Pic
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 10, 2022 | 3:07 PM

Nirmal electricity bill: అతను ఓ రేకుల షెడ్డులో నివశిస్తున్నాడు.  ఇల్లు చూస్తే.. పెచ్చులూడి పోయిన పాత గోడలు.. గట్టిగా గాలివాన వచ్చిందంటే కూలిపోయేట్టున్న పై కప్పు.  పేద కుటుంబం.  ఇంట్లో ఒక ప్యాన్, ఒక టీవి, రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. కానీ కరెంట్ బిల్ మాత్రం కోట్లలో వచ్చింది. సాధారణంగా కరెంట్‌ ముట్టుకుంటే షాక్‌ కొడుతుందని తెలుసు.. కానీ, ఈ కరెంట్ బిల్ చూసి ఆ యజమానికి షాక్ కొట్టినంత పనైంది. ఆయనకే కాదు ఆ బిల్ ఎంతో చెబితే మీకు షాక్ కొడుతుంది.  ఎందుకంటే.. ఆ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు అక్షరాల రూ.21కోట్లు ( ఇరవై ఒక్క కోట్లు). సాధారణంగా ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. వందల్లోనో, లేదంటే… కాస్త ఎక్కువగా వినియోగిస్తే వేలలో వస్తుంటుంది. అదే, చిన్నపాటి దుకాణాలు, మెకానిక్‌ షెడ్లకు కమర్షియల్‌ బిల్లు పేరిట కాస్త సాధారణం కంటే ఎక్కువగానే వస్తుంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిర్మల్ జిల్లా సారంగాపూర్‌కు చెందిన వడ్ల అవుజయ్య అనే వ్యక్తి ఇంటికి బుధవారం కరెంట్ రీడింగ్  తీసే వ్యక్తి వచ్చాడు.  మీటర్‌ని స్కాన్ చేసి.. బిల్లు రాగానే  ఇచ్చి వెళ్లిపోయాడు. ప్రతి నెల లాగానే   రూ.300 నుంచి రూ.400 మధ్య వచ్చి ఉండొచ్చు అనుకన్నాడు అవుజయ్య. కానీ బిల్లులో ఉన్న అమౌంట్ చూసి అతడి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. బిల్లు మొత్తం రూ.21,47,48,364 అని ఉండడంతో అతడికి కాసేపి ఏమీ అర్థం కాలేదు. తేరుకున్న అనంతరం… వెంటనే  అధికారుల వద్దకు పరుగులు తీశాడు. అక్కడున్న స్టాఫ్ సైతం తొలుత ఆ బిల్లును చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే విచారణ చేపట్టి.. స్కానింగ్ మెషీన్‌లో సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించాడు. మళ్లీ స్కానింగ్ తీయించి ఆయనకు ఇచ్చారు. రెండోసారి తీసినప్పుడు ఎప్పట్లానే బిల్లు రావడంతో అవుజయ్యకు ఊపిరి పీల్చుకున్నాడు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో వివిధ జంతువులు ఉన్నాయి.. ఒంటె ఎక్కడుందో వెంటనే చెప్పేస్తే మీరు గ్రేట్ అబ్బా…