Radhe Shyam: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 25 వరకు..
Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా కోసం ఒక్క ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాహుబలి (Bahubali) తర్వాత పాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో రాధేశ్యామ్ (RadheShyam) సినిమాపై...
Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా కోసం ఒక్క ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాహుబలి (Bahubali) తర్వాత పాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas) నుంచి వస్తోన్న చిత్రం కావడంతో రాధేశ్యామ్ (RadheShyam) సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధా కృష్ణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రేపటి (శుక్రవారం) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సందడి చేయడానికి సిద్ధమయ్యారు. పలుసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ప్రేక్షకులను అలరించేందుకు వస్తుండడంతో ఫ్యాన్స్ ఇప్పుటి నుంచే సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. రాధేశ్యామ్ సినిమా ఐదో ఆటకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మార్చి 11 నుంచి మార్చి 25వ తేదీ వరకూ ఐదో షో ప్రదర్శించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక వింటేజ్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ హస్త సాముద్రికుడిగా కనిపించనున్నాడు. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలువుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: Telangana: కరెంట్ బిల్లును చూడగానే షాక్.. రేకుల షెడ్డుకు ఏకంగా రూ.21కోట్లు..
Goa Election Results: మళ్లీ గోవాలో మాదే అధికారం.. సీఎం ప్రమోద్ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Blackmail: న్యూడ్ కాల్స్‌తో బ్లాక్ మెయిల్… మాయలేడి వలలో పడి లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. వీడియో