Blackmail: న్యూడ్ కాల్స్‌తో బ్లాక్ మెయిల్… మాయలేడి వలలో పడి లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. వీడియో
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఒక్క రాత్రిలోనే లక్షల రూపాయల సొమ్మును పోగొట్టుకున్నాడు. మాయలేడి ఇచ్చిన ట్విస్ట్‌కు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజ్మీర్‌లోని చౌరాసియావాస్ రోడ్‌లో నివసిస్తున్న ఒక యువకుడికి సోషల్ మీడియాలో
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఒక్క రాత్రిలోనే లక్షల రూపాయల సొమ్మును పోగొట్టుకున్నాడు. మాయలేడి ఇచ్చిన ట్విస్ట్‌కు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజ్మీర్‌లోని చౌరాసియావాస్ రోడ్‌లో నివసిస్తున్న ఒక యువకుడికి సోషల్ మీడియాలో ఖుషి వర్మ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరియం కాస్తా డీప్‌గా వెళ్లిపోయింది. ఇద్దరూ తమ తమ మొబైల్ నెంబర్లను మార్చుకున్నారు. యువతితో ఫోన్‌లో మాట్లాడిన తరువాత వీడియో కాల్ చేస్తానని చెప్పగా.. అవతలివైపున యువతి ఓకే చెప్పింది. ఇంకేముంది మనోడు రెచ్చిపోయి వీడియో కాల్ చేశాడు. అంతటితో ఆగకుండా దుస్తులు విప్పలాంటూ తనలోని కోరికలను మెల్ల మెల్లగా వెలిబుచ్చాడు. అసలే మాయలేడి, ఆమెకు కావాల్సింది కూడా అదే కాబట్టి. ఓకే అంది. బాధిత యువకుడు సైతం దుస్తులు తీసేసి వీడియో కాల్‌లో మాట్లాడాడు. అయితే, ఆ మాయలేడి దీన్నంతటినీ రికార్డ్ చేసింది. బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టింది. తనకు డబ్బులు పంపించాలని డిమాండ్ చేసింది. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేసింది. దాంతో బెదిరిపోయిన బాధిత యువకుడు.. మొదట 5వేల 100రూపాయలు పంపాడు. ఆ తరువాత మళ్లీ 10 వేల రూపాయలు అడిగితే అవి కూడా పంపాడు. అలా ఒక్క రాత్రిలోనే మొత్తం 1లక్ష 30వేల రూపాయలు ఆ మాయ లేడి లాగేసింది. ఇక లాభం లేదనుకున్న బాధిత యువకుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..