Sreeleela: క్రేజ్‌తో దూసుకుపోతోన్న కుర్రభామ.. ఏకంగా ఏడు సినిమాలతో..

బయట ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లో దుమ్మురేపుతున్న బ్యూటీస్ చాలా మంది ఉన్నారు. అక్కడ ఆఫర్లు, క్రేజ్ టాలీవుడ్ లో అందుకుంటూ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు కొందరు ముద్దుగుమ్మలు

Sreeleela: క్రేజ్‌తో దూసుకుపోతోన్న కుర్రభామ.. ఏకంగా ఏడు సినిమాలతో..
Sreeleela
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 29, 2022 | 9:50 AM

బయట ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లో దుమ్మురేపుతున్న బ్యూటీస్ చాలా మంది ఉన్నారు. అక్కడ ఆఫర్లు, క్రేజ్ టాలీవుడ్ లో అందుకుంటూ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు కొందరు ముద్దుగుమ్మలు.. ఆ లిస్ట్ లో అందాల భామ శ్రీలీల కూడా ఒకరు. ఆ ముద్దుగుమ్మ తన అందం, అభినయం, చలాకీ తనంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీ లీల తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటుంది.

ప్రస్తుతం తెలుగులో మాస్ మహారాజ రవితేజ సరసన సినిమా చేస్తోంది. ధమాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తోంది శ్రీ లీల. అంతే ఇప్పుడు ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో ఏకంగా ఏడు తెలుగు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. రవితేజ.. బాలయ్య.. వైష్ణవ్.. శర్వానంద్.. నితిన్ సినిమాల్లోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం.

అలాగే మరికొన్ని సినిమాల్లోనూ ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఇలా ఇప్పుడు ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అటు సీనియర్లతో పాటు ఇటు జూనియర్లు.. మరోవైపు అగ్రహీరోలతో జతకట్టనున్న ఈ బ్యూటీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. శ్రీలీల వరుస సినిమాలతో బిజీ అవ్వడమే కాదు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట. తక్కువ సమయంలో ఇలా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..