Mahesh Babu: మహేష్ ఇంటికే కన్నం వేయాలనుకున్నాడు.. కానీ సీన్ రివర్స్
ఓ పక్క అమ్మ ఇందిరా దేవీచనిపోయిన బాధలో మహేష్.. మహేష్ కుంటుంబ సభ్యులు ఉంటే.. మరో పక్క ఓ దొంగేమో.. మహేష్ ఇంటికే కన్నం వేసేందుకు ప్రయత్నించాడు.
ఓ పక్క అమ్మ ఇందిరా దేవి చనిపోయిన బాధలో మహేష్.. మహేష్ కుంటుంబ సభ్యులు ఉంటే.. మరో పక్క ఓ దొంగేమో.. మహేష్ ఇంటికే కన్నం వేసేందుకు ప్రయత్నించాడు. ప్రయత్నించడమే కాదు మహేష్ ఇంటి గోడ ఆవల వైపు వరకు కూడా చేరుకున్నాడు. కాని ఆ తరువాతే సీన్ రివర్స్ అవడంతో… హాస్పటల్ పాలయ్యాడు.
ఇక ఎప్పుడో జూబ్లిహిల్స్ లోని ప్రశాసన్ నగర్‌లో ఓ లావిష్ ఇల్లు కట్టుకున్న మహేష్ .. తన ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే తండ్రి కృష్ణ ఇంటికి వెళుతుంటారు. కాని రెండు మూడు రోజుల నుంచి మహేష్ మదర్ ఇందిరా దేవీ హెల్త్ బాగలేకపోవడంతో.. మహేష్ అండ్ ఫ్యామిలీ ఆమె దగ్గరే ఉంటున్నారు. తాజాగా ఆమె మరణించడంతో.. కర్మకాండలన్నీ పూర్తి అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు.
కాని ఇంతలోనే ఒడిశాకు చెందిన కృష్ణ అనే దొంగ.. ఎవరూ లేని మహేష్ ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు. అర్థరాత్రి చడీ చప్పుడు కాకుండా మన హీరో ఇంటి గోడెక్కి దూకాడు. కాని గోడ పక్కనే ఉన్న చెట్ల మధ్యలో పడి కాళ్లు విరగొట్టుకున్నాడు. ఇక ఈ దొంగను గమనించిన మహేష్ ఇంటి సెక్యూరిటీ గార్డు.. దెబ్బలు తగిలించుకున్న దొంగను ఆసుపత్రిలో చేర్చి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..